టాలీవుడ్‌లో పోలీసు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అందుకే కథానాయకులు సైతం పోలీస పాత్రలు చేసేందుకు మక్కువ చూపిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పోలీసు ట్రెండ్ నడుస్తోంది. దీంతో కథానాయకులు మళ్లీ పోలీసు కథలపై తమ దృష్టి కేంద్రీకరించారు. ఖాకీ దుస్తుల్లో కనిపించి తమ అభిమానులను అలరిస్తున్నాారు. అటు డైరెక్టర్లు సైతం పోలీసు స్టోరీలను సిద్దం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఏ సినిమాలో ఇప్పుడు చూద్దాం.
1. విజయ్ దేవరకొండ
ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఖుషీ తర్వాత గీతా గోవిందం డైరెక్టర్ పరుశురామ్, జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరితోనూ విజయ్ సినిమాలు చేయనున్నాడు. గౌతం డైరెక్షన్‌లో విజయ్ VD12 సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపిస్తాడని టాక్. ఇప్పటికీ సినిమా కథను గౌతం తిన్ననూరి చెప్పగా అది రౌడీబాయ్‌కు విపరీతంగా నచ్చేసిందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తమ హీరోను ఖాకీ దుస్తుల్లో చూసేందుకు ఇప్పటినుంచే ఆసక్తి కనబరుస్తున్నారు.
2. నాని
హిట్ -3 సినిమాతో నాని (NANI) కూడా మొదటిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్‌గా నాని కనిపించబోతున్నాడు. హిట్ -2 క్లైమాక్స్‌లో పోలీస్‌గా నాని లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్‌ను పెంచేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది.
3. నాగ చైతన్య
నాగ చైతన్య (Naga Chaitanya) – కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. చై తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తుండటంతో ఇప్పటినుంచే ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.
4. అల్లరి నరేష్
అల్లరి నరేష్ (Allari Naresh) లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’.. ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో నరేష్ సీఐగా కనిపించి మెప్పించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా నరేష్ కనిపించాడు. యాక్షన్ సీన్లలోనూ ఇరగదీయగలనని నిరూపించుకున్నాడు. ఉగ్రంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం నరేష్ అందుకున్నాడు.
5. కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. ఎప్పుడూ ప్రేమికుడిగా, పక్కింటి కుర్రాడి పాత్రల్లో కనిపించే కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఎస్సైగా మెప్పించాడు. ఇందులో కిరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మీటర్ స్ట్రీమింగ్ అవుతోంది.
6. రామ్ పోతినేని
యంగ్ హీరో రామ్ పోతినేని (Ram pothineni) – కృతి శెట్టి (Krithi Shetty) జంటగా చేసిన చేసిన సినిమా వారియర్. ఈ సినిమాలో రామ్ తొలిసారి పోలీసు గెటప్‌లో కనిపించాడు. మామూలుగానే యాక్షన్ సీన్లలో అదరగొట్టే రామ్.. ఒంటిపైన ఖాకీ దుస్తులతో ఈ సినిమాలో మరింత ఇరగతీశాడు. అయితే ఆశించిన రేంజ్‌లో వారియర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. పోలీసు పాత్రలోనూ మెప్పించగలనని రామ్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.
7. సుధీర్ బాబు
విలక్షణమైన సినిమాలు, పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu). ఆయన చేసిన రీసెంట్ మూవీ ‘హంట్’ మిశ్రమ టాక్ తెచ్చుకుంది. ఇందులో సుధీర్‌బాబు కూడా పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. గతంలో ‘V’ సినిమాలోనూ సుధీర్ బాబు పోలీసాఫీసర్‌గా చేశాడు. యాక్షన్ సీన్స్‌లో తనదైన మార్క్‌ను చూపిస్తూ అదరగొట్టాడు. ఇందులో సుధీర్‌బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!