• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపే ధనుష్ ‘సార్’ ట్రైలర్

    వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం సార్. తమిళంలో ‘వాతి’గా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే సినిమా మ్యూజికల్‌గా హిట్ సాధించింది. మూడు పాటలకూ మంచి స్పందన లభిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. #VaathiTrailer FROM TOMORROW ?@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash … Read more

    నారాయణ మూర్తిని ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం

    ఆర్ నారాయణ మూర్తి ప్రజా దర్శకుడని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. పీపుల్‌ స్టార్ తెరకెక్కించిన యూనివర్సిటీ అనే చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో నారాయణ మూర్తిని పొగుడుతూనే ఆయన్ని ఇమిటేట్ చేశారు. “ ఆయన సినిమాలో నటిస్తానని చాలాసార్లు చెప్పాను. ఏదైనా పాత్ర ఉంటే రెండ్రోజులు చేసి వెళతాను అన్నాను. రెమ్యూనరేషన్ అడగలేదు. కానీ, అడిగిన ప్రతిసారి మీరు పెద్ద స్టార్, సూపర్ యాక్టర్ అంటాడు. అంతేకానీ అవకాశం ఇవ్వలేదు” అన్నారు.

    ‘వసంత కోకిల’ ట్రైలర్ లాంఛ్ చేసిన చిరు

    విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా నటించిన ‘వసంత కోకిల’ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. [ట్రైలర్](url) ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీలో బాబీ సింహా సరసన కాశ్మీరా నటిస్తోంది. ఈ మూవీని తెలుగులో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్ మూవీగా రమణన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆర్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న ఈ మూవీ విడుదల కానుంది. Thank you @KChiruTweets garu for this kind … Read more

    LIVE: అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

    నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే విడుదలైన అమిగోస్ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. డోపుల్ గ్యాంగర్‌ అనే కథాంశంతో సినిమాను రూపొందించారు. ముగ్గురు ఒకేలా ఉంటారు కానీ, కవలలు కాదు.

    హోయసల పవర్‌ఫుల్‌ టీజర్‌

    కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరో పవర్‌ఫుల్‌ సినిమా రాబోతోంది. విజయ్‌ ఎన్ దర్శకత్వంలో ధనంజయ హీరోగా ఓ పోలీస్‌ స్టోరీ త్వరలో అలరించనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌లో యాక్షన్‌ సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

    SSMB 28 నుంచి తమన్‌ ఔట్.. క్లారిటీ

    మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’ నుంచి తమన్‌ని తీసేసినట్లు తెగ పుకార్లు పుట్టుకొచ్చాయి. తమన్ ఇచ్చిన ట్యూన్ చిత్రబృందానికి నచ్చలేదని.. ఈ విషయం చెప్పడంతో తమన్ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే, ఇవన్నీ కట్టు కథలేనని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీనిపై తమన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘నెగెటివిటీ’ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో ఓ మ్యూజిక్ బిట్‌ని యాడ్ చేశారు. దీంతో చర్చ అక్కడితో ముగిసిపోయింది. Rest In … Read more

    ‘లియో’గా వస్తోన్న తలపతి విజయ్

    తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ‘లియో’గా వస్తున్నాడు. సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘లియో; బ్లడీ స్వీట్’గా వస్తోంది. ఈ మేరకు సినిమా యూనిట్ టైటిల్‌ను రివీల్ చేసింది. ఈ టైటిల్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ జమ్ము కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

    విజయ్‌ చిత్రానికి సరికొత్త టైటిల్‌

    దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం టైటిల్ ఖరారయ్యింది. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో మాస్టర్‌ తర్వాత విజయ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రానికి దర్శకుడు ఎవ్వరూ ఊహించని టైటిల్‌ పెట్టాడు. సినిమాకు లియో: బ్లడీ స్వీట్‌ అనే పేరు ప్రకటించారు. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి అక్టోబర్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త టైటిల్ ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేసిన చిత్రబృందం వీడియో కూడా విడుదల చేసింది.

    కల్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్

    కల్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రిభినయం చేస్తుండగా… ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అభిమానులు అంచనాలు తగ్గట్లుగానే రూపొందించారు. డోపుల్ గ్యాంగర్ నేపథ్యంలో సాగే కథతో మరోసారి హిట్‌ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. డోపుల్ గ్యాంగర్ అంటే ఒకే పోలికతో ఉండే వ్యక్తులు.. కానీ, కవలలు కాదు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించింది.

    సౌత్‌ సినిమాలో జాన్వీ- క్లారిటీ

    అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ సౌత్‌ సినిమాలో అడుగుపెడుతోందంటూ వస్తున్న వార్తలపై జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. కార్తి సూపర్‌హిట్‌ సినిమా పైయాకు సీక్వెల్‌గా వస్తున్న పైయా2లో జాన్వీ నటిస్తోందని వార్తలు వచ్చాయి. వీటికి సమాధానమిస్తూ బోనీ కపూర్‌ తన ట్విట్టర్‌లో “ మీడియా మిత్రులారా, జాన్వీ ప్రస్తుతం ఎలాంటి తమిళ సినిమాకు కమిట్‌ కాలేదు. దయచేసి పుకార్లు ప్రచారం చేయొద్దు” అంటూ ట్వీట్ చేశారు. Courtesy Instagram: Screengrab Instagram:jhanvikapoor … Read more