• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోనసీమ థగ్స్‌ నుంచి ‘హే అందమే’ పాట విడుదల

    ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కోనసీమ థగ్స్’. హ్రిదు హరూన్‌ హీరోగా పరిచయమవుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ షిబు తమీన్స్‌ తనయురాలు రియా షిబు హెచ్‌ ఆర్ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ ‘హే అందమే’ విడుదల చేశారు. శామ్ సీఎస్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.

    ‘పొట్టి పిల్ల’ అంటూ టీజ్‌ చేస్తున్న ప్రియదర్శి!

    హాస్యనటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బలగం’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘పొట్టి పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌పై తనకున్న ప్రేమను చెబుతూనే ‘పొట్టి పిల్ల’ అని టీజ్‌ చేస్తున్నాడు. ఆమె వెళ్లిన చోటికి వెళ్తూ మనసులోని ప్రేమను గుర్తించాలని చెబుతున్నాడు. ఒప్పుకుంటే తాను చేస్తానో సాంగ్‌ రూపంలో చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

    మహేష్ బాబు ‘మురారి’ @ 22 ఏళ్లు

    [వీడియో](url);సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, సొనాలి బింద్రే హీరోయిన్‌గా తెరకెక్కిన ‘మురారి’ విడుదలై 22 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. 2001 ఫిబ్రవరి 17న రిలీజై సంచలన విజయం అందుకుంది. మహేష్ కెరీర్‌ను ఈ మూవీ ఓ మలుపు తిప్పింది. ఈ చిత్రానికి ముందు మహేష్ రెండు సినిమాలు (‘వంశీ’, ‘యువరాజు’) పరాజయం పాలయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘మురారి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. 22 Years For Superstar @urstrulyMahesh' #Murari Movie? … Read more

    వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్

    యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా లవ్‌ ట్రాక్‌ను విడుదల చేశారు. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే అంటూ సాగే పాట అలరిస్తోంది. హీరోయిన్ వెంట పడుతూ హీరో పాడుతున్నట్లు ఉంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సినిమాలో మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. https://youtube.com/watch?v=EjzfkqfmUo

    ‘బ్యాంచత్’ పదం వాడకంపై నాని క్లారిటీ

    ‘దసరా’ సినిమాలో ‘బ్యాంచత్’ అనే పదం వాడటంపై నాని క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవలం ఎమోషన్‌లో భాగంగా వచ్చే పదమేనని తెలిపాడు. ఈ పదానికి బూతు అర్థం వస్తున్నప్పటికీ, తెలంగాణలో ఈ పదం వేరే రకంగా వాడుకలో ఉందని చెప్పాడు. ‘మన భావోద్వేగాలను బయటపెట్టేదే భాష. ఇది తప్పక చేసి చూపిస్తానని ఇతరులకు సవాల్ చేసే క్రమంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం. సినిమాలోనూ ఆ విధంగానే వాడాం. అంతే తప్ప ద్వంద్వార్థాలు వెతకొద్దు. పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పండి’ అని నాని వివరణ ఇచ్చాడు.

    కియారా దంపతులకు RC15 విషెస్

    కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టిన సందర్బంగా RC15 చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ శంకర్, హీరో రామ్‌చరణ్‌, నిర్మాత దిల్‌రాజుతో పాటు మూవీ టీం పూలను వెదజల్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ చార్మినార్ వద్ద జరుపుకొంది. కాగా, జైసల్మీర్‌లో కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం వైభవంగా జరిగింది. Team #RC15 … Read more

    ‘ఓరి వారి నీది గాదురా పోరి’ సాంగ్ ప్రోమో

    నాని ‘దసరా’ మూవీ నుంచి రెండో పాట ప్రోమో విడుదలైంది. ‘ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసైరా ఇంగ ఒడిసెను దారి’ అంటూ సాగే గీతాన్ని సంతోష్ నారాయణన్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా రేపు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి పాటకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పాటపై అంచనాలు పెరిగాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 5 భాషల్లో ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.

    స్పీల్ బర్గ్ మాటలకు ఉబ్బితబ్బిబైన రాజమౌళి

    ఎస్ఎస్ రాజమౌళి- హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్ బర్గ్ కలిసి మాట్లాడిన వీడియో యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా స్పీల్ బర్గ్ డైరెక్ట్ చేసిన ది ఫాబెల్ మాన్స్ సినిమాపై జరిగి లైవ్ కార్యక్రమంలో వీరిద్దరు ముచ్చటించారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. RRR మూవీ తాను చూశానని చాలా అద్భుతంగా ఉందని స్పీల్ బర్గ్ మెచ్చుకోగా.. ఆ మాటలకు తాను ఈ కార్యక్రమం పక్కకు పెట్టి డ్యాన్స్ చేయాలని ఉందని జక్కన్న ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియోను రిలయన్ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ … Read more

    బిచ్చగాడు2 ట్రైలర్ విడుదల

    విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న చిత్రం బిచ్చగాడు 2 నుంచి ట్రైలర్ రిలీజైంది. స్నీక్ పీక్ పేరుతో ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో బ్రైయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ఆసక్తికర సన్నివేశాలను చూపించారు. ప్రపంచానికి డబ్బు హానికరం అనే స్టోరీలైన్‌ ఈ చిత్రం రూపొందింది. బిచ్చగాడు 2 ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంటోని ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బిచ్చగాడు 1 రిలీజైన అన్ని భాషల్లో సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

    బాలయ్య, పవన్‌లను ప్రశ్నించిన క్రిష్..!

    పవర్ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ గ్లింప్స్‌ని ఆహా విడుదల చేసింది. డైరెక్టర్ క్రిష్ బాలయ్య, పవన్‌లను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో తమతో పనిచేయడంపై అభిప్రాయాన్ని చెప్పాలని క్రిష్‌ని బాలయ్య కోరారు. దీంతో ‘త్రివిక్రమ్ అందుకే తప్పించుకున్నారా?’ అంటూ సరదాగా క్రిష్ వ్యాఖ్యానించారు. అనంతరం పవన్ కళ్యాణ్, బాలకృష్ణలను క్రిష్ పలు ప్రశ్నలు అడిగారు. ఇదంతా సరదాగా సాగుతుండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ రోజు రాత్రి 9గంటలకు పార్ట్-2 ప్రసారం కానుంది. సీజన్2కి ఇదే ఫైనల్ ఎపిసోడ్ అని ఆహా వెల్లడించింది. Power … Read more