• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విరూపాక్ష మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు మోషన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. విరూపాక్ష మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రవారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. Get ready to Enter the World of #Virupaksha ?️? 'Supreme … Read more

    వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ వచ్చేసింది

    వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ వచ్చేసింది. థియేటర్లలో విజిల్స్ వేయించిన సీన్ ఈ పాటలోనిదే. చిరంజీవి ఏనుగుపై నుంచి విలన్‌ని చంపే సీన్ థియేటర్లలో ఈలలు వేయించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ నెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. రవితేజ కీలక పాత్ర పోషించగా, బాబీ దర్శకత్వం వహించారు.

    హాలివుడ్‌ సినిమాలు చేస్తా: రామ్‌ చరణ్‌

    [VIDEO](url): HCA అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన నటుడు రామ్‌ చరణ్‌… ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటు నాటు పాటను ప్రమోట్‌ చేస్తున్నాడు. అందులో భాగంగానే గుడ్‌మార్నింగ్‌ అమెరికా టాక్‌షోలో పాల్గొన్నాడు. తాజాగా మరో ఇంటర్నేషనల్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో హాలివుడ్‌లో నటిస్తారా అని ప్రశ్నించగా. “ ప్రస్తుతం ఇండియాలోనే సినిమాలు చేస్తున్నా. తప్పకుండా హాలివుడ్‌లోనూ చేస్తా. ఇండియా టాలెంట్‌ను ఇక్కడ కూడా చూపించాలనుకుంటున్నా. మంచి అవకాశం వస్తే తప్పకుండా హాలివుడ్‌లో నటిస్తా” అని సమాధానమిచ్చారు. Proven Winner ? @AlwaysRamCharan … Read more

    ‘మార్టిన్‌’ టీజర్‌ మరో KGF తరహా సినిమా

    కన్నడ ఇండస్ట్రీలో KGF సినిమాల విజయంతో వరుసగా యాక్షన్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఉపేంద్ర ‘కబ్జా’ ట్రైలర్‌ అచ్చం KGFలా ఉందంటూ మాట్లాడుకుంటున్న వేళ… మరో సినిమా టీజర్‌ కూడా అలాగే ఉంది. ధ్రువ్‌ సార్జా హీరోగా ఎ. పి. అర్జున్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మార్టిన్‌’. ఈ సినిమా టీజర్‌లో డైలాగ్స్‌, విజువల్స్‌, బీజీఎం అన్నీ కేజీఎఫ్‌ను గుర్తుచేసేలా ఉన్నాయి.

    గ్రంథాలయం ట్రైలర్ విడుదల

    విన్ను మద్దిపాటి, స్మ్రిత రాణి నటిస్తున్న చిత్రం గ్రంథాలయం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. కాలకేయ ప్రభాకర్, అలోక్ జైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సాయి శివన్ దర్శకత్వం వహిస్తుండగా… వైష్ణవి శ్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 3న గ్రంథాలయం చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

    అమెరికాలో భారీ ఎత్తున ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రీ రిలీజ్‌!

    ‘RRR’ చిత్రాన్ని అమెరికాలో మాసివ్‌ రీ రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది. మార్చి 3న సుమారు 200 థియేటర్స్‌లో కంప్లీట్‌గా తెలుగు వర్షన్‌లో మూవీని రిలీజ్‌ చేయనున్నారు. యూఎస్‌లోని ఫేమస్‌ ‘ఏస్‌ హోటల్‌’ స్క్రీన్‌లో కూడా ఈ సినిమాను మార్చి 1న రిలీజ్‌ చేయాలని యూనిట్ ప్లాన్‌ చేస్తోంది. దీనికి డైరక్టర్ రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎం.ఎం.కీరవాణి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలుస్తోంది. కాగా ‘RRR’ రీ రిలీజ్‌కు సంబంధించి సరికొత్త [ట్రైలర్‌ ](url)విడుదల కాగా దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. #RRR FINAL … Read more

    చావు తప్పించుకున్న హీరో విశాల్‌

    [VIDEO](url):హీరో విశాల్‌ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన హీరోగా దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘మార్క్‌ ఆంటోని’ ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. సీన్‌లో భాగంగా విశాల్‌ నేలపై పడిపోగా అదే సమయంలో ఓ భారీ ట్రక్కు దూసుకొచ్చింది. సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన ఈ ప్రమాదం నుంచి విశాల్‌ రెప్పపాటులో బయటపడ్డారు. కొన్ని ఇంచుల దూరంలో చావును చూశా అంటూ విశాల్‌ ప్రమాదపు వీడియోను షేర్‌ చేశారు. … Read more

    ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యింది

    అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మళ్లీ మళ్లీ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యిందంటూ చిత్ర యూనిట్‌ పాటను విడుదల చేశారు. హిపాప్‌ తమిజా చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 28న ట్రైలర్ విడుదల కానుంది.

    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు

    గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు  కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.  మిస్టర్ కింగ్ కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.  డెడ్‌ లైన్  ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను … Read more

    ‘నాంది’ని మించి ఉంటుంది; ‘ఉగ్రం’ టీజర్‌పై చైతూ

    అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌ను యువసామ్రాట్ నాగచైతన్య రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చైతు మాట్లాడుతూ ‘‘అల్లరి నరేష్ అద్భుత నటుడు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ‘ఉగ్రం’ సినిమా ‘నాంది’ని మించి ఉంటుంది. ‘ఉగ్రం’ టీజర్ అదిరిపోయింది. డైరెక్టర్ విజయ్ కనకమేడల మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలుస్తుంది.’’ అంటూ నాగచైతన్య పేర్కొన్నారు.