మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’ నుంచి తమన్‌ని తీసేసినట్లు తెగ పుకార్లు పుట్టుకొచ్చాయి. తమన్ ఇచ్చిన ట్యూన్ చిత్రబృందానికి నచ్చలేదని.. ఈ విషయం చెప్పడంతో తమన్ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే, ఇవన్నీ కట్టు కథలేనని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీనిపై తమన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘నెగెటివిటీ’ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో ఓ మ్యూజిక్ బిట్‌ని యాడ్ చేశారు. దీంతో చర్చ అక్కడితో ముగిసిపోయింది.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్