• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘ధమాకా’ సాంగ్

    మాస్ మహారాజా హీరోగా నటించిన ‘ధమాకా’ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ‘వాట్స్ హ్యాపెనింగ్’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేయగా, శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ విడుదల చేయడంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించగా, డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు.

    ఉత్కంఠగా ‘మాయాపేటిక’ ఫస్ట్ గ్లింప్స్

    ‘మాయాపేటిక’ ఫస్ట్ గ్లింప్స్ వీడియోను చిత్ర బృదం రిలీజ్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. సెల్ ఫోన్ వల్ల ప్రపంచం తల దించుకుని బతకాల్సి వచ్చిందంటూ నటుడు రానా చెప్పే వాయిస్ ఓవర్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సునీల్, పృధ్వీ, హిమజ, శ్రీనివాసరెడ్డి, విరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రమేష్ రాపర్తి తెరకెక్కించారు. ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

    ‘సలార్‌’ సెట్‌ నుంచి వీడియో లీక్‌

    ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్ మాస్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్‌’. ఈ సినిమా నుంచి ప్రతి పండుగకూ ఫోటోలతో అప్డేట్స్‌ ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా సినిమా నుంచి లీక్‌లు ఆగడం లేదు. షూటింగ్‌ స్పాట్ నుంచి ఫోటోలు వీడియోలు లీక్‌ అవుతూ చిత్రబృందాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా మరో వీడియో సెట్‌ నుంచి లీకయింది. యూనిట్‌లో షాట్ రెస్ట్‌ సమయంలో ఎవరితోనో సరదాగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    35 ఏళ్ల తర్వాత మణి-కమల్ కాంబో రిపీట్

    దాదాపు 35 ఏళ్ల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్- డైరెక్టర్ మణిరత్నంలు మళ్లీ సినిమా తీయబోతున్నారు. 1987లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం వీరిద్దరూ మళ్లీ జోడీ కట్టి [‘KH-234’ ](url)మూవీ చేయబోతున్నారు. నిర్మాతలు మహేంద్రన్, శివ అనంత్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. Here we go again! #KH234பயணத்தின் அடுத்த கட்டம்! #ManiRatnam @Udhaystalin @arrahman #Mahendran … Read more

    నా తమ్ముడు హిట్ కొట్టడం సంతోషంగా ఉంది: అల్లు అర్జున్‌

    పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ తన తమ్ముడి పట్ల ఎమోషనల్‌ అయ్యాడు. ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్‌ మీట్‌లో మాట్లాడిన అల్లు అర్జున్‌..తన తమ్ముడిని అంతరూ పొగడుతుంటే సంతోషంగా ఉందన్నాడు. తాను హిట్‌ కొట్టినా ఇంత ఆనంద పడనని కానీ తన తమ్ముడిని అందరూ మెచ్చుకోవడం బాగుందన్నాడు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాకేష్‌ శశి దర్శకత్వంలో ‘ఊర్వశివో రాక్షసివో’ తెరకెక్కింది. ఈ నెల 4న విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

    ‘ఆహ నా పెళ్లంట’ ట్రైలర్ అదిరింది

    రాజ్ తరుణ్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన ఆహ నా పెళ్లంట చిత్రం ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. కనీ వినీ ఎరుగని గోలంట అనే క్యాప్షన్ ఇచ్చిన సినిమా పెళ్లి చుట్టూ తిరుగుతుంది. చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సాయిదీప్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అమల, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో నటించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమాను తెరకెక్కించారు. నో బాల్ నారాయణ రాజ్ తరుణ్ తండ్రిగా హర్ష వర్ధన్ నటించారు.

    ‘కాంతార’ రిషభ్‌ శెట్టితో ఏబీ డివిల్లీర్స్‌

    ప్రాంతీయ సినిమాగా మొదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే వినిపిస్తోంది. తాజాగా ఐపీఎల్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కాంతారతో జతకట్టింది. ఏబీ డివిల్లీర్స్‌తో కలిసి రిషభ్‌ శెట్టి ‘కాంతార’ అంటూ చేసిన ఓ [వీడియో](url)ను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. It’s a match.The real 360s today of the film industry and Cricket.#Kantara @shetty_rishab @ABdeVilliers17 @RCBTweets @hombalefilms @VKiragandur @gowda_sapthami @HombaleGroup @ChaluveG @Karthik1423 … Read more

    ‘వారిసు’ సాంగ్‌ ప్రోమోపై ట్రోల్స్‌

    విజయ్‌ దళపతి, రష్మిక మంధాన లీడ్‌ రోల్స్‌లో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలి పాటకు సంబంధించిన ప్రోమోను ఇవాళ విడుదల చేశారు. దీనికి థమన్‌ సంగీతం అందించగా, జానీ మాస్టర్‌ నృత్య రీతులు సమకూర్చారు. అయితే ప్రోమో విడుదలైన తర్వాతి నిమిషం నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి. అదే మ్యూజిక్, అవే స్టెప్పులు ఎన్నిసార్లు భయ్యా అంటూ థమన్, జానీ మాస్టర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

    కాలేజీల్లో ‘లైక్,షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ టీం

    ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ టీం ప్రచారంలో జోరు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో తిరుగుతూ సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్ కళాశాల విద్యార్థులతో చిత్రబృందం మమేకమైంది. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తమ స్టెప్పులతో కాసేపు అలరించారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు. తమ సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కాగా, ఈ మూవీ రేపు విడుదలవుతోంది. Team #LikeShareSubscribe had a Blasting … Read more

    అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ ట్రైలర్‌

    దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2009లో విడుదలైన వెండితెర అద్భుతం అప్పట్లో సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ‘అవతార్‌’ సీక్వెల్‌కు సంబంధించిిన ట్రైలర్ విడుదలైంది. ఇటీవల అవతార్‌ రీ రిలీజ్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేలా ఉంది.