• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టైం ఇవ్వు పిల్ల కొంచెం అంటున్న నిఖిల్

    కార్తీకేయ 2తో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకున్న నిఖిల్‌ నటిస్తున్న 18 పేజేస్‌ చిత్రం నుంచి మరో పాట వచ్చేసింది. “టైం ఇవ్వు పిల్ల కొంచెం” అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటను తమిళ హీరో శింబు ఆలపించారు. సినిమాకు దర్శకుడు సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనూ అనుపమ హీరోయిన్‌గా నటిస్తోంది. బన్నీవాసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ రిలీజ్

    లవ్ మాక్‌టెయిల్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. దేవ్‌‌ పాత్రలో సత్యదేవ్ కొత్త లుక్‌లో అలరించాడు. ప్రియదర్శి, సత్యదేవ్‌ల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు, ముగ్గురితో ప్రేమాయణం నడిపి.. ఒకరిని పెళ్లి చేసుకున్న దేవ్‌కి ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే విషయాన్ని ట్రైలర్‌లో క్లుప్తంగా చూపించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు … Read more

    థ్రిల్లింగ్‌గా ‘ముఖచిత్రం’ ట్రైలర్

    యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘ముఖచిత్రం’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది లవ్ స్టోరీయో.. లేదా థ్రిల్లరో కాదు.. స్పోర్ట్స్ డ్రామా అంటూ సాగే డైలాగ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మూవీలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పాకెట్ మంకీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    తెలుగులోనూ ‘రంజితమే’

    తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ’వారిసు’ చిత్రంలో ‘రంజితమే’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 25 రోజుల్లోనే 7 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేస్తున్నారు. రంజితమే సాంగ్‌ను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. వంశీ పైడిపల్లి ఈ మూవీని తెరకెక్కించారు. జనవరి 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

    రష్యన్ భాషలో పుష్ప ట్రైలర్

    బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని రష్యన్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 8న విడుదలకు ముహుర్తం ఖరారయ్యింది. కేవలం వారం మాత్రమే సమయం ఉండటంతో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేయకుండా…మన దగ్గర రిలీజ్ చేసిన దానికి రష్యన్ లో డబ్బింగ్ చెప్పారు. భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ట్రెండ్ సెట్ చేసింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్ అన్నిచోట్లకు పాకింది.

    ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్

    బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ఐదు విభిన్న స్టోరీల సమాహారంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. ప్రేమ, అనుబంధాల కలబోతతో ముడిపడిన జీవితాలను ప్రస్ఫుటం చేసేలా ఉన్న ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్, ప్రశాంత్ విహారీ ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టికెట్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.

    ధమాకా నుంచి మరో పాట విడుదల

    రవితేజ హీరోగా డ్యుయల్ రోల్‌లో వస్తున్న చిత్రం ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డు..డు..వీడు ల్యాండుమైను లెక్క’ అంటూ సాగే ఈ పాటను పృథ్వీ చంద్ర ఆలపించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. కాగా, ఈ సినిమాలోని మిగతా పాటలకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డిసెంబరు 23న మూవీ రిలీజ్ కానుంది.

    ఫుల్ ఎనర్జిటిక్‌గా ‘జై బాలయ్య’ సాంగ్

    నటసింహం నందమూరి బాలక్రిష్ణ హీరోగా తెరకెక్కిన వీరశివారెడ్డి చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ‘జై బాలయ్య’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. హీరో పాత్రను తెలియజేసేలా ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటకు థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

    రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా జంటగా ‘వేడ్‌’

    2019లో రియల్‌ కపుల్‌ రీల్‌ కపుల్‌గా నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘ మజిలీ’. ఈ సినిమాలో ఆన్‌స్క్రీన్‌పై సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇప్పుడు ఇదే సినిమాను మరో స్టార్ కపుల్ జంటగా తెరకెక్కిస్తున్నారు. బాలివుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా జంటగా ‘వేడ్‌’ అనే టైటిల్‌తో మరాఠీలో ఈ సినిమా రాబోతోంది. రితేష్‌ దేశ్‌ముఖ్‌ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తీస్తున్నాడు. రితేష్‌, జెనీలియా జంటకు సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఉన్న మంచి ఫాలోయింగ్ ఈ సినిమాకు కలిసి రావొచ్చు.

    అదిరిపోయింది.. ఈ ‘బాస్ పార్టీ’

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘బాస్ పార్టీ’ అంటూ సాగుతున్న ఈ పాట హోరెత్తిస్తోంది. నకాశ్ ఆజిజ్, దేవీ శ్రీ ప్రసాద్, హరిప్రియ ఈ పాటను ఆలపించారు. డీఎస్పీ సంగీతం ఇరగదీశాడు. మాస్ బీట్‌కి చిరు స్టెప్పులు తోడవ్వడంతో పాట మరోస్థాయికి వెళ్లింది. ఈ పాటను డీఎస్పీ లిరిక్స్ అందించడం విశేషం. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. హీరో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘డీజే వీరయ్య’గా … Read more