• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఉత్కంఠ రేపుతున్న కార్తికేయ 2 మేకింగ్ వీడియో

  హీరో నిఖిల్ కార్తికేయ 2 మూవీ నుంచి మేకింగ్ వీడియో విడుదలైంది. రేపు ఈ చిత్రం రిలీజ్ కానుండగా ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, మరోవైపు మంచు, సముద్రంలో డాల్ఫిన్లతో వీడియో ఉత్కంఠ రేపుతోంది. ఇంకోవైపు ఎగిసిపడుతున్న మంట, ఎగరిపోతున్న నెమలి కూడా ఈ చిత్రంపై క్రేజ్ ని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి చందు మొండేటీ దర్శకత్వం వహించగా, నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది.

  నెట్టింట్లో ర‌చ్చ‌చేస్తున్న ‘లైగ‌ర్’ ఆంథెమ్

  ప్ర‌ముఖ సింగ‌ర్ నిఖిలేష్ కుమార్ ‘లైగ‌ర్’ టీమ్‌కు అంకితం ఇస్తూ లైగ‌ర్‌ ఆంథెమ్ సాంగ్‌ను రిలీజ్ చేశాడు. ఈ పాట బాలీవుడ్‌లో ర‌చ్చ చేస్ఉంది. ముంబై వీధులలో చాయ్ వాలాగా ఉన్న ఒక చిన్న కుర్రాడు బాక్సార్‏గా ఎలా మారాడు. దానికోసం ఎలాంటి శిక్ష‌ణ తీసుకున్నాడు అని ఈ పాట‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్‌లో బాక్స‌ర్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడ‌దులైన ట్రైల‌ర్‌, పాట‌ల‌కు భారీ స్పంద‌న ల‌భిస్తుంది. లైగ‌ర్ ఆగ‌స్ట్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  నార్త్‌లో విజ‌య్ క్రేజ్ మామూలుగా లేదుగా!

  ‘లైగ‌ర్’ టీమ్‌కు ఎక్క‌డికి వెళ్లినా భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుండం విశేషం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా టీమ్ ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నింటినీ చుట్టేస్తుంది. అయితే విజ‌య్‌, అన‌న్య ఎక్క‌డికి వెళ్లినా వేల‌కొద్ది ఫ్యాన్స్ వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. ఇది ఇండ‌స్ట్రీకి చాలా ఆశ్ఛ‌ర్యం క‌లిగిస్తుంది. ఎందుకంటే లైగ‌ర్ విజ‌య్ చేస్తున్న మొద‌టి పాన్ ఇండియా మూవీ. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే ఇంత‌మంది ఫ్యాన్స్ వారికోసం రావ‌డం విశేషం. నిన్న పుణెలో విజ‌య్‌, అన‌న్య ఒక షాపింగ్ మాల్‌లో సంద‌డి చేశారు. వారిని చూసేందుకు … Read more

  ‘మాచర్ల నియోజకవర్గం’ టీంతో సుమ ఇంటర్వ్యూ

  నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రేపు(ఆగష్టు 12న) విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ ప్రమోషనల్ జోరు పెంచేసింది. తాజాగా స్టార్ యాంకర్ సుమతో ఇంటర్వ్యూ నిర్వహించింది. ‘సుమ క్రాక్స్ మాచర్ల నియోజకవర్గం’ పేరుతో నిర్వహించిన ఈ ప్రమోషన్ వైరల్ అవుతుంది.

  NBK108 అఫీషియల్ అనౌన్స్‌మెంట్

  నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గరికపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమాలో బాలయ్యను ఎప్పుడూ చూడని విధంగా చూపిస్తామని మూవీ యూనిట్ పేర్కొంది.

  ‘మీకు చిన్న థాంక్యూ సరిపోదు’ మృనాల్ క్యూట్ స్పీచ్

  ‘సీతారామం’ సక్సెస్‌తో చిత్రబృందం ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది. ఇవాళ మరోసారి చిత్రబృందం సక్సెస్‌ మీట్ నిర్వహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ మృనాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘మీరు కరిపిస్తున్న ప్రేమకు ఒక్క మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేను. సినిమాను ఒకటికి రెండు సార్లు చూస్తున్న అభిమానులకు మీ సీత నుంచి కృతజ్ఞతలు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

  అతి పిన్న స్వాతంత్రోద్యమకారుడు ‘ఖుదీరాం బోస్’పై సినిమా

  దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారిలో ఖుదీరా బోస్ ఒకరు. తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే పోరాడి 18 ఏళ్లకే ఉరి శిక్ష పాలైన వీరుడు. అటువంటి గొప్ప ఉద్యమ కారుడిపై ‘ఖుదీరాం బోస్’ పేరిట సినిమా రాబోతోంది. విద్యాసాగర్ రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 15న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

  రాఖీ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తన తర్వాతి చిత్రం ‘భోళా శంకర్’ ద్వారా చిన్న వీడియోతో చిరు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ‘అక్కా చెల్లెల్లందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు ప్రేమతో మీ సోదరుడు చిరంజీవి’ అంటూ ఆయన మాటల్లో చెప్పారు. భోళా శంకర్ సినిమాను మెహెర్ రమేశ్ తెరకెక్కిస్తుండగా, AK ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

  అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ

  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత హిందీలో ఓ మంచి సినిమా చూశామని ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. సినిమా అన్ని విధాలుగా నచ్చిందని అంటున్నారు. అద్వైత్ చందన్ డైరెక్షన్ సూపర్ అని, ఈ సినిమాలో కామెడీ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం అమీర్ ఖాన్ కే దక్కుతుందని, కరీనా కపూర్ తో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెబుతున్నారు. ఫ్లాప్ సినిమాలతో డీలా పడిన బాలీవుడ్ … Read more

  కార్తికేయ టీం విజయవాడ టూర్ హైలైట్స్

  నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి తెరకెక్కించిన సినిమా ‘కార్తికేయ 2’. ఆగష్టు 13వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. దాని తగ్గట్టే చిత్రబృందం ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విజయవాడలో ప్రమోషన్ నిర్వహించింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Highlights from #Karthikeya2 team visit at Vijayawada! The … Read more