ప్రభాస్ ప్రోమో వచ్చేసింది
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్‌స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్2 ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ కూడా సందడి చేశాడు. ఈ ప్రోమోలో ఈ ఇద్దరి యంగ్ హీరోలతో హోస్ట్ బాలకృష్ణ తెగ అల్లరి చేశారు. ప్రభాస్‌కు సంబంధించిన పర్సనల్ విషయాల గురించి బాలయ్య ఆరాతీశాడు. తనను కూడా డార్లింగ్ అంటూ పిలవాలని ప్రభాస్‌ను బాలకృష్ణ కోరాడు. పెళ్లి ఎప్పుడు అనగా సల్మాన్‌ఖాన్ పెళ్లి తర్వాత అంటూ ప్రభాస్ నవ్వులు పూయించాడు.