విమర్శకులకు షారుఖ్ స్ట్రాంగ్ కౌంటర్
తనపై వస్తోన్న విమర్శలకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకున్నా డోంట్ కేర్. సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. సోషల్ మీడియా సంకుచిత దృష్టి కోణంతో చూస్తూ ఉంటుంది. ఎవరేమనుకున్నా ‘పఠాన్’ సినిమా రిలీజ్‌ను ఆపలేరు.’’ అంటూ షారుఖ్ ఘాటుగానే సమాధానమిచ్చాడు. కాగా షారుఖ్ నటించిన ‘పఠాన్’లోని బేషరమ్ సాంగ్‌లో హీరోయిన్ దీపిక పడుకొనే హాట్ హాట్‌గా నటించడంతో కొందరు విమర్శిస్తున్నారు.