అమ్మకు ప్రేమతో
పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు. వారికి ఓ చిన్న బహుమతి ఇస్తే మురిసిపోతుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తల్లికి బంగారు గొలుసు బహుమతిగా తీసుకువచ్చి కుమారుడు సర్ ప్రైజ్ చేశాడు. ఆమె అందరికి భోజనాలు వడ్డిస్తుండగా వెనకాల నుంచి మెడలో వేశాడు. మెుదట ఆశ్చర్యపోయిన తల్లి తర్వాత నవ్వుతూ సంబరపడిపోయింది. https://twitter.com/i/status/1592199922484670464