• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    See More

    కరీంనగర్‌లో స్మశానంలో దీపావళి వేడుకలు

    దీపావళి అనగానే లక్ష్మీపూజలు, టపాసుల సంబరాలు గుర్తొస్తాయి కానీ కరీంనగర్‌లో మాత్రం స్మశానంలో దీపావళి వేడుకలు చేసుకుంటారు. కరీంనగర్‌ పాకానగడ్డ హిందూ స్మశానవాటికలో సమాధులను అలంకరించి దీపాలు వెలిగించి వేడుకలు చేసుకుంటారు. తమ పూర్వీకులకు ఇష్టమైన ఆహారం, పానీయాలు అందిస్తూ వారిని పూజించుకుంటారు. తమవారు భౌతికంగా వెళ్లిపోయినా..తమతోనే ఉన్నట్లుగా భావించి వారితో కలిసి పండుగ చేసుకుంటామని స్థానికులు చెబుతున్నారు.

    వాట్సాప్‌ డౌన్‌పై మీమ్స్‌ మోత

    ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో పాటు అనేక దేశాల్లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అనేక మంది మెసేజ్‌లు చేయలేకపోతున్నారు. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వాట్సాప్‌ చెప్పింది. అయితే వాట్సాప్‌లో నిత్యం 10 వేల కోట్ల మెసేజ్‌లు వెళ్తాయి. 150 దేశాల్లో వాట్సాప్‌కు యూజర్లు ఉన్నారు. దీంతో ట్విట్టర్‌లో ఇప్పుడు వాట్సాప్‌పై మీమ్స్‌ మోత మోగుతోంది. అనేక మంది వాట్సాప్‌ ఆగిపోవడంపై ఫన్నీ మీమ్స్‌ చేస్తున్నారు. అందులో కొన్ని మీరు కూడా చూడండి.

    కలెక్టర్ కూతురి రౌడీయిజం

    తమ ఇంటి ముందు సంత ఏర్పాటు చేసినందుకు ఓ ఐఏఎస్ కూతురు రెచ్చిపోయింది. అక్కడున్న షాపులను ధ్వంసం చేసి హంగామా సృష్టించింది. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. మాజీ కలెక్టర్ శంకర్‌లాల్ కూతురు ఇంటి ఎదురుగా వీధి వ్యాపారులు దీపావళి సందర్భంగా సంత నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువతి వారి వస్తువులపై నీళ్లు పోసి, ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. వెంటనే కర్ర తీసుకొచ్చి అక్కడున్న వస్తువులను ధ్వంసం చేసింది. https://youtube.com/watch?v=MK73stQgn7I

    ‘రేప్‌’కు గురైన బాలికను వీడియోలు తీసిన స్థానికులు

    అభం, శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై కీచకులు అఘాయిత్యానికి పాల్పడి, రక్తపు మడుగులో పారేసి వెళ్తే…సాయం చేయాల్సిందిపోయి, ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారిని ఫోటోలు, వీడియోలు తీసిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. కన్నౌజ్‌ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై పాపను చేతుల్లో మోసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకున్నాడు. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. #kannauj #Kannaujgirl pic.twitter.com/mglIuwA0ce — youth point … Read more

    “మిడిల్‌ క్లాస్‌ జిందగీ” బ్యూటిఫుల్‌ వీడియో

    “మాకు మమ్మీ కన్నా అమ్మ పిలుపులోనే కమ్మదనం ఉంటుంది. మాకు డాడీ గ్యాడ్జెట్‌ కన్నా నాన్న సైకిల్‌పై షికారు సరదాగా ఉంటుంది. మా ఇంటి బూస్టు డబ్బాలో పప్పు ఉంటుంది. పోపు డబ్బాలో పైసలు ఉంటాయి. నా పాత ప్యాంటు మా ఇంటి డోర్‌ మ్యాట్‌గా ఉంటుంది. నా పాత చొక్క వంటింట్లో మసి గుడ్డగా ఉంటుంది. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువైనా సంబరాన్నిస్తుంది. అమ్మా, నాన్నలను హత్తుకోవడంలోనే ప్రపంచం ఉంటుంది. మేం మిడిల్‌ క్లాస్‌ వాళ్లం. చిన్న చిన్న వాటిలోనే గొప్ప ఆనందాల్ని వెతుక్కుంటాం” … Read more

    అనకాపల్లిలో కింగ్ కోబ్రా కలకలం

    ఏపీలోని అనకాపల్లిలో ఉన్న మాడుగుల మండలంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. దాదాపు 14 అడుగుల పొడవున్న కోబ్రా.. స్నేక్ క్యాచర్లకు కూడా చుక్కలు చూపించింది. పామాయిల్ తోటలో ఉన్న కోబ్రాను కూలీలు చూసి పరుగులు తీశారు. అనంతరం స్నేక్ క్యాచర్స్‌ వచ్చి పామును పట్టడానికి నానా తంటాలు పడ్డారు. రెండు గంటల శ్రమ అనంతరం దానిని పట్టుకుని నెల్లిమర్ల అడవుల్లో వదిలిపెట్టారు. దీంతో కూలీలు, పామాయిల్ తోట యజమాని ఊపిరి పీల్చుకున్నారు.

    పిల్ల పెంగ్విన్ దాహం కేకలు

    ఓ పిల్ల పెంగ్విన్ దాహంతో అల్లాడిపోతుండగా, దానికి ఓ వ్యక్తి నీళ్లు పట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ పిల్ల పెంగ్విన్ దాహంతో అల్లాడుతోంది. అది గమనించిన ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్‌తో ఆ బుల్లి పక్షికి నీటిని అందించాడు. దీంతో అది కొద్ది కొద్దిగా నీరు తాగుతూ దాహం తీర్చుకుంది. ఆ వ్యక్తి చేసిన సాయాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. The thirsty … Read more

    4 నెలల్లో 900 మైళ్ల ఈత

    బ్రిటన్‌కు చెందిన 23 ఏళ్ల యువతి కేవలం 110 రోజుల్లో 900 మైళ్ల దూరాన్ని ఈదుకుంటూ గమ్యానికి చేరింది. బ్రిటన్ స్విమ్మర్ జాస్మిన్ ‘సెల్టిక్’ సముద్రంలో ఈత కొట్టి రికార్డు సాధించింది. రోజుకు 12 గంటలపాటు 28 కి.మీ ఈదింది. భోజనం, నిద్ర కోసం ఆమె ఏర్పాటు చేసుకున్న పడవలోకి వెళ్లేది. అటు షార్క్స్, ఇటు అలలను తప్పించుకుంటూ ఆమె ఈదుకుంటూ గమ్యానికి చేరుకుంది. సీ షెఫర్డ్ యూకే అనే స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించటానికి ఈ సాహస యాత్ర చేసినట్లు జాస్మిన్ … Read more

    అతడి తెలివికి హ్యాట్సాప్

    సాధారణంగా టమాటాలను లోడింగ్ చేయాలంటే కష్టంతో కూడుకున్న పనే. కానీ ఓ వ్యక్తి మాత్రం అవలీలగా టమాటాలు లోడింగ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి టమాటా బుట్టను గాల్లోకి విసిరేస్తే టమాటాలు ట్రక్కులోకి, బుట్ట వెనక్కి వచ్చి కింద పడిపోతోంది. దీంతో వేగంగా టమాటాలను ట్రక్కులో వేస్తున్నాడు. ఇతడి తెలివిపై ‘ఆర్నాల్డ్ పవర్.. ఐన్‌స్టీన్ తెలివి’ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Power of Arnold, brain of Einstein pic.twitter.com/3W0dL3c1Dt — Sagar (@sagarcasm) October 18, … Read more

    VIRAL: కొండచిలువ కబాబ్

    చికెన్,మటన్, ఫిష్ కబాబ్‌ల వలే.. కొండచిలువ కబాబ్ కూడా ఉంటుందని తెలుసా? అవును. కొండచిలువ తోలు వొలిచి దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కబాబ్ చేస్తారు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ 10అడుగులకు పైగా పొడవున్న కొండచిలువ తోలుని చాకుల సాయంతో వొలిచారు. అనంతరం ముక్కలు ముక్కలుగా చేసి మసాలాలు దట్టించారు. కబాబ్‌ని సిద్ధం చేసుకుని లొట్టలేసుకుంటూ ఆరగించారు. కొంచెం కర్రీ కూడా చేసుకున్నారు. మరోసారి వైరల్ అవుతున్న ఈ వీడియోకి 3కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.