బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. నటుడు రణ్‌వీర్.. ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలను తొలగించడంతో సంచలనంగా మారింది. త్వరలో వీరిద్దరు వీడిపోతున్నారా? అన్న ఊహాగానాలకు ఇది తెరలేపింది.
తాజాగా రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను (Ranveer Singh Removes Wedding Pictures) పరిశీలించిన కొందరు ఫ్యాన్స్.. అందులో పెళ్లి ఫొటోలు లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ మేటర్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
చిత్ర పరిశ్రమలో మరో స్టార్ జంట విడాకులకు సిద్ధమవుతోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు బాలీవుడ్ వర్గాలు, జాతీయా మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కానీ, రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన ఫొటోలు (Ranveer and Deepika’s divorce Rumours) మాత్రమే మిస్ అయ్యాయి. దీపికతో మాములుగా దిగిన ఫొటోలు అంతే ఉన్నాయి. దీంతో రణ్‌వీర్ కావాలనే ఈ ఫొటోలను డిలీట్ చేసి తమ మధ్య ఉన్న మనస్పర్థలను బహిర్గతం చేశారని రూమర్లు మెుదలయ్యాయి.
అయితే బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సమాచారం. రణ్‌వీర్ ఈ మధ్యే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆర్చీవ్ చేశారట. ఆ కారణంగా తన అకౌంట్‌లో 2023కి ముందు పెట్టిన పోస్టులన్నీ ఆర్చీవ్ అయ్యి కనబడటం లేదట.
ప్రస్తుతం ఈ జంట తమ తమ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇక దీపిక ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. వీరి జోడీని తెరపై చూసేందుకు ఇరువురు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.
2013లో రిలీజైన రామ్‌లీలా సినిమాలో దీపికా – రణ్‌వీర్ తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాల్లో కలిసి నటించారు.
దాదాపు ఆరేండ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2018లో దీపికా – రణ్‌వీర్ సింగ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చాలా మంది హాజరయ్యారు.
అయితే రణ్‌వీర్ – దీపికా (Deepika & Ranveer’s Relationship) విడాకులపై రూమర్లు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు వీరు విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు దీపికా చేసిన వ్యాఖ్యలు రణ్‌వీర్‌కు కోపం తెప్పించాయి. ఇక వారు విడిపోవడం ఖాయమని నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ, అది తప్పను ఈ జంట నిరూపించింది.