శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్ మోహన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్ మోహన్ 18 సెప్టెంబర్ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే దేవ్ మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచాడు. 2020లో రజీనా అనే అమ్మాయిని దేవ్ పెళ్లి చేసుకున్నాడు.
2020 లో మళయాళం మూవీ ‘సూఫీయుం సుజాతయుమ్’ చిత్రం ద్వారా తొలిసారి దేవ్ మోహన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో ‘సూఫీ రోల్‌లో కనిపించి దేవ్ మెప్పించాడు. ఆ తర్వాత 2021లో పులి, పంత్రండు చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ కంట్లో పడ్డ దేవ్ మోహన్ శాకుంతలం చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన దేవ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ప్రశ్న: శాకుంతలం ఆఫర్ ఎలా వచ్చింది?
దేవ్: నిర్మాత నీలిమ నా ఫస్ట్ ఫిల్మ్ ‘సూఫీయుం సుజాతయుమ్’ చూశారు. నా నటను ఆమెకు నచ్చింది. శాకుంతలంలో దుశ్యాంత పాత్రకు నేను సరిపోతానని ఆమె ఫీలయ్యారు. దీంతో ఆమె నన్ను సంప్రదించారు. మెుదట ఏదో ప్రాంక్ చేస్తున్నారని భావించా. నీలిమ, డైరెక్టర్ గుణశేఖర్‌తో మాట్లాడిన తర్వాత నిజమని నిర్ధారించుకున్నా. ఇందులో చేయడం ద్వారా నా కల నేరవేరినట్లు భావిస్తున్నా.
ప్రశ్న: తెలుగు ఇండస్ట్రీ, గుణశేఖర్ గురించి మీకు అవగాహన ఉందా?
దేవ్: తెలుగు సినీ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది. అల్లు అర్జున్ సినిమాలు మా దగ్గర (కేరళ) చాలా ఫేమస్. ఆర్య, హ్యాపీ సినిమాలు చూశాను. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చూశాను. గుణశేఖర్ గారి ఒక్కడు, రుద్రమదేవి చిత్రాలు చూశాను. ఆయనో చాలా గొప్ప దర్శకులు.
ప్రశ్న. శాకుంతలం కోసం మీరు తీసుకున్న ట్రైనింగ్ ?
దేవ్: ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా. రోజుకు రెండు గంటలు గుర్రపు స్వారీ చేసే వాడ్ని. తొలి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. భుజం, వెన్ను నొప్పి వచ్చేది. క్రమంగా ఎంజాయ్ చేయడం ప్రారంభించా. గుర్రానికి బాగా కనెక్ట్ అయ్యి ట్రైనింగ్‌ను ఆస్వాదించాను.
ప్రశ్న. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు?
దేవ్: డైలాగ్స్‌ను డైరెక్టర్ నాకు వాయిస్ నోట్ పంపేవారు. నేను దాన్ని విని మలయాళంలో రాసుకునే వాడ్ని. షూటింగ్‌కు ముందు రోజు డైరెక్టర్‌ను కలిసి డైలాగ్ చెప్పేవాడ్ని. ఏమైనా తప్పు ఉంటే సరిచేసుకొని షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పాను.
పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ చూడండి..
అవార్డులు దాసోహం…
అరంగేట్రం సినిమాలతోనే దేవ్ మోహన్ తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. ‘సూఫీయుం సుజాతయుమ్’ మూవీకి ‘ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’లో ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సమయం మూవీ అవార్డులోనూ ఉత్తమ అరంగేట్ర యాక్టర్‌గా దేవ్ మోహన్ ఎంపికయ్యాడు. అటు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో బెస్ట్ డెబ్యూట్ మేల్ పురస్కారాన్ని దేవ్ అందుకున్నాడు.
దేవ్ మోహన్, రష్మిక మందన్నా జంటగా కొత్తగా రెయిన్‌బో చిత్రం తెరకెక్కబోతోంది. అక్కినేని అమల ఈ చిత్రం షూటింగ్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఏప్రిల్ 7 నుంచి రెయిన్‌బో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాకు శాంతరూబన్ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్