• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  •  Failure Hero’s: స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్‌ హీరోలు తెలుసా?

    ప్రస్తుతం టాలీవుడ్‌లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్‌ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు టాలీవుడ్‌లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చుద్దాం.

    అక్కినేని అఖిల్‌:

    అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్‌(Akhil) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అతడు చేసిన అఖిల్‌, హలో, మిస్టర్‌ మజ్నూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద  విఫలం  అయ్యాయి.  మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ హిట్ కొట్టిన అఖిల్..  ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానున్న ఏజెంట్‌ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఫలితంగా అఖిల్ కెరీర్‌ ఆధారపడి ఉంది.

    అల్లు శిరీష్‌:

    చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్‌ కుమారుడు శిరీష్‌ (Allu Sirish) మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్‌ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఊర్వశివో.. రాక్షసివో’ ఫెయిల్యూర్స్‌తో శిరీష్ సినీ కెరీర్‌ మరింత డల్ అయ్యింది. 

    అల్లరి నరేష్‌:

    దిగ్గజ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్‌ (Allari Naresh) తన తొలి చిత్రం ‘అల్లరి’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ‘తొట్టి గ్యాంగ్‌’, ‘సీమశాస్త్రి’, ‘బెండు అప్పారావు’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ దశలో కామెడీ స్టార్‌గా ఎదుగుతున్నట్లే కనిపించిన నరేష్‌.. వరుస ఫ్లాప్‌లతో ఆ ట్యాగ్‌కు దూరమయ్యాడు. వరుసగా సినిమాలు చేసినా అవేమి చెప్పుకోదగ్గ హిట్స్‌ ఇవ్వకపోవడంతో నరేష్‌కు హీరో అవకాశాలు తగ్గాయి. దీంతో కారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన నరేష్‌.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు నరేష్.

    సుశాంత్‌:

    అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌ (Sushanth) 2008లో కాళిదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవగా తర్వాతి ఏడాది వచ్చిన కరెంటు మూవీతో సుశాంత్‌ పర్వాలేదనిపించాడు. కానీ అడ్డా, దొంగాట, ఆటాడుకుందా రా, చిలాసౌ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో సుశాంత్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సుశాంత్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుశాంత్ రావణాసుర, భోళాశంకర్‌ చిత్రాల్లో నటించారు. 

    ఆది పినిశెట్టి:

    దిగ్గజ డైరెక్టర్‌ రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి (Aadi pinisetty) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఒక V చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద హీరో రెంజ్‌ సంపాదించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు రోల్స్‌ చేస్తున్నాడు. 

    ఆది:

    నటుడు సాయికుమార్‌ వారసుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ తో మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, గరం వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్‌ ఒడిదొడుకులకు లోనైంది. దీంతో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇటీవలే ‘మేక పులి’ సిరీస్‌ ద్వారా ఆకట్టుకున్నాడు. 

    రాజా గౌతం:

    హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గౌతం సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. మళ్లీ 2014లో ‘బాసంతి’ సినిమాతో గౌతమ్ ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఫెయిలవ్వగా ఆ తర్వాత మను, బ్రేక్ ఔట్ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. 

    అరుణ్‌ దాసరి:

    టాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంతో మంది నటులను స్టార్‌ హీరోలుగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అరుణ్‌ దాసరి తెలుగు ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమయ్యారు. 2001లో చిన్నా సినిమా  ద్వారా వెండి తెరకు పరిచయమైన అరుణ్‌ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆది విష్ణు’ చిత్రం సైతం ఫ్లాప్‌గా నిలవడంతో అరుణ్‌ హీరో కెరీర్‌ మసకబారిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన అరుణ్‌ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv