Game Changer: RX100పై వచ్చి రిలీజ్ డేట్ చెప్పిన చరణ్ 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Game Changer: RX100పై వచ్చి రిలీజ్ డేట్ చెప్పిన చరణ్ 

    Game Changer: RX100పై వచ్చి రిలీజ్ డేట్ చెప్పిన చరణ్ 

    December 10, 2024

    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుంది. జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజుల క్రితం వరకూ వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చిన మేకర్స్ ‘పుష్ప 2’ రిలీజ్ నేపథ్యంలో కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదిరిపోయే న్యూస్‌తో మరోమారు ఫ్యాన్స్‌లో ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. 

    మరో 30 రోజుల్లో.. 

    రామ్‌చరణ్‌ – శంకర్‌ కాంబోలో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి తదితరులు కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుగా ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదలకు సరిగ్గా 30 రోజుల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ మేకర్స్ అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో చరణ్‌ RX100 బైక్‌పై ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో కాలేజ్‌ డేస్‌కు సంబంధించిన సీన్స్‌ నుంచి ఈ పోస్టర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. 

    చరణ్‌.. షూట్ జ్ఞాపకాలు

    మెగా తనయుడు రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నాడు. షూటింగ్‌ సమయంలో చిత్ర బృందంతో దిగిన ఫొటోలను వీడియో రూపంలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ‘నానా హైరానా’ సాంగ్‌ షూటింగ్‌ సందర్భంలో తీసిన ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను ఇందులో గమనించవచ్చు. డైరెక్టర్‌ శంకర్‌తో పాటు చిత్ర నిర్మాత దిల్‌రాజు కూడా కనిపించారు. అలాగే వీడియో మధ్యలో కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌ను చరణ్‌ గట్టిగా హగ్‌ చేసుకోవడం ఆకట్టుకుంటోంది. ఇటీవలే విడుదలైన ‘నానా హైరానా’ (Naana Hyraanaa) సాంగ్‌ సూపర్‌గా మెలోడీగా సంగీత ప్రియులను ఆకట్టుకుంది. 

    అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌

    ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) రిలీజ్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ (Game Changer Advance Bookings)పై మూవీ టీమ్‌ ఫోకస్‌ పెట్టింది. ‘మెగా మాస్‌ మేనియాకు పట్టం కట్టాల్సిన సమయం ఇది. అత్యంత హైప్స్‌తో ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్‌ యూఎస్‌ఏ బుకింగ్‌లు డిసెంబర్‌ 14 నుంచి మెుదవుతాయి’ అని మేకర్స్‌ తెలిపారు. కాగా, యూకేలో ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మెుదలయ్యాయి. ఆ దేశంలో జనవరి 9న ప్రీమియర్‌ షో పడనుంది. అక్కడి కేంబ్రిడ్జ్‌లోని ప్రతిష్టాత్మక ది లైట్‌ సినిమాస్‌ చెయిన్‌లో షో వేయనున్నారు. 

    అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌..

    ‘గేమ్ ఛేంజర్’ (Game changer) ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో నిర్వహించనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ 21న గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో సాయంత్రం 6:00 గంటలకి ప్రారంభం కానుంది. దీంతో అమెరికాలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుపుకుంటున్న తొలి చిత్రంగా గేమ్‌ ఛేంజర్‌ నిలవనుంది. కాగా, ఈ ఈవెంట్‌ కోసం ఓవర్సీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version