Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?

    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?

    August 28, 2023

    నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షివైద్య, వినయ్ రాయ్, నాజర్, విమలా రామన్‌, రవివర్మ తదితరులు

    దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు 

    నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్ 

    సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్

    సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు 

    విడుదల తేదీ : ఆగస్టు 25, 2023

    మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ప్రవీణ్‌ సత్తారు(Praveen sattaru) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య (Sakshi vaidya) హీరోయిన్‌గా నటించింది. BVS ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉంది? ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించింది? వరుణ్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.

    కథ

    కథలోకి వెళితే ఆచార్య (నాజర్‌) అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి. విలన్లు చేసే మెడికల్‌ స్కామ్‌ వల్ల మనుషులతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నట్లు ఆచార్య గ్రహిస్తాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో ఆచార్యను చంపేందుకు విలన్‌ మనుషులు ప్రయత్నిస్తుంటారు. దీంతో తనకు రక్షణ కల్పించడంతో పాటు, మెడికల్‌ స్కామ్‌ను ఎలాగైనా ఆపే బాధ్యతను రా ఏజెంట్‌ అర్జున్ (వరుణ్‌తేజ్‌)కు ఆచార్య అప్పగిస్తాడు. ఈ క్రమంలో అర్జున్‌కు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి? మెడికల్‌ స్కామ్‌ను అతడు ఎలా బయటపెట్టాడు? ఆ స్కామ్‌కు పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.

    ఎలా సాగిందంటే

    గాండీవధారి అర్జున మూవీ రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగానే ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ చూసే కొందరిని తప్ప.. మిగతావారిని ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ వరకు మూవీ సాగదీతగా అనిపిస్తుంది. కొంత నాటకీయత ఉన్నప్పటికీ అదీ ఎలివేట్ చేయబడలేదు. తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ ఆశించే ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మూవీ ఒక లోకేషన్ నుంచి మరో లోకేషన్‌కు ఈజీగా వెళుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉంది. పెద్దగా మలుపులు, ట్విస్ట్స్ అంటూ ఏమీ లేవు. 

    ఎవరెలా చేశారంటే..?

    గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ్ యాక్షన్ రోల్ చేశాడు. తన పర్సనాలిటీతో ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోను తలపించాడు. అయితే యాక్షన్‌ చిత్రం కావడంతో నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. అయినప్పటికీ వరుణ్‌ ఉన్నంతలో తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక సాక్షి వైద్య సినిమా మొత్తం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. నాజర్‌ ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. మనీశ్ చౌదరీ, రవి వర్మ పరిధి మేరకు నటించారు.

    టెక్నికల్‌గా 

    ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ కాలేకపోయింది. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. అటు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సైతం నామమాత్రంగానే ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఇచ్చే BGM లాగా అనిపించలేదు. G. ముఖేశ్‌ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆయన పనితనం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • వరుణ్‌ తేజ్‌ నటన
    • యాక్షన్‌ సన్నివేశాలు
    • సినిమాటోగ్రఫీ

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటిన్‌ స్టోరీ
    • డైరెక్షన్‌
    • పాటలు
    • నో థ్రిల్స్‌ & నో ట్విస్ట్స్‌

    సినిమా రేటింగ్‌: 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version