ఇస్తాంబుల్ లోని ఇస్తిక్ లాల్ అనే రద్దీ గా ఉండే ఓ వ్యాపార ప్రదేశంలో పేలుడు సంభవించింది. ఇందులో ఆరుగురు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా పేలుడు జరగటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఎక్కడివారక్కడ భయంతో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఓ [వీడియో](url) వైరల్ అయ్యింది. పేలుడుకు మానవ బాంబు కారణమని అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. తీవ్రవాద దాడిగా ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇస్తాంబుల్ లో మానవబాంబు పేలుడు!

Screengrab Twitter:tender