iPhone 16 సిరీస్ ప్రీ-ఆర్డర్ సేల్స్ ఈరోజు (సెప్టెంబర్ 13న సాయంత్రం 5.30 గంటల) నుంచి అందుబాటులోకి వచ్చాయి. iPhone 16 సిరీస్ గత వారం ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. ఇందులో నాలుగు కొత్త మోడల్స్ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి.ఈ నాలుగు iPhoneలలో, iPhone 16 Pro మాత్రమే తన మునుపటి మోడల్ అయిన iPhone 15 Pro కంటే తక్కువ ధరతో విడుదలైంది.
iPhone 16 Series Pre-Order
శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు iPhone 16 సిరీస్ ప్రీ-ఆర్డర్ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఈ నాలుగు iPhone 16 మోడళ్లు సెప్టెంబర్ 20 నుంచి షిప్పింగ్ ప్రారంభం అవుతాయి. వినియోగదారులు కొత్త iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Maxలను Apple Store, Apple రిటైల్ షాప్‌లు (ముంబై, ఢిల్లీలో మాత్రమే ), అలాగే Flipkart, Amazon, Reliance Digital, Croma, Vijay Sales వంటి రిటైల్ స్టోర్ల ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
iPhone 16, iPhone 16 Plus ధరలు
భారత్‌లో iPhone 16 128GB మోడల్ ప్రారంభ ధర రూ. 79,900 కాగా, 256GB, 512GB వేరియంట్ల ధరలు వరుసగా రూ. 89,900, రూ. 1,09,900గా ఉన్నాయి. iPhone 16 Plus ప్రారంభ ధర 128GB మోడల్ కోసం రూ. 89,900గా నిర్ణయించారు. 256GB, 512GB వేరియంట్ల ధరలు వరుసగా రూ. 99,900, రూ. 1,19,900గా ఉన్నాయి.
కలర్స్
ఇక iPhone 16, iPhone 16 Plus సీరిస్ ఫోన్లు Ultramarine, Teal, Pink, White, Black కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.
iPhone 16 Pro, iPhone 16 Pro Max ధరలు
iPhone 16 Pro ధర భారత్‌లో తన మునుపటి మోడల్ కంటే తక్కువ ధరతో విడుదలైంది. iPhone 16 Pro ప్రారంభ ధర 128GB మోడల్ అయితే రూ. 1,19,900 కాగా, 256GB, 512GB, 1TB వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1,29,900, రూ. 1,49,900, రూ. 1,69,900గా ఉన్నాయి..
ఇక iPhone 16 Pro Max దీని ప్రారంభ ధర 256GB మోడల్ రూ. 1,44,900కాగా, 512GB, 1TB వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1,64,900, రూ. 1,84,900 ధరలు ఉన్నాయి.
కలర్స్
iPhone 16 Pro, iPhone 16 Pro Max మోడల్స్ Desert Titanium, Natural Titanium, White Titanium, Black Titanium రంగుల్లో లభిస్తాయి.
ఆఫర్లు
iPhone 16 సిరీస్ అన్ని నాలుగు మోడళ్లపై American Express, Axis Bank, ICICI Bank సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 5,000 ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ అందించబడుతుంది. దీనికి అదనంగా మూడు నుంచి ఆరు నెలల కాలానికి Nocost EMI ప్లాన్లను కూడా ఆయా బ్యాంక్‌లు అందిస్తున్నాయి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్