Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 

    Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 

    March 6, 2024

    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌.. మోడ్రన్‌ డ్రెస్‌ వేసినా, చీర కట్టినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీ కట్టాలంటే తన తర్వాతే ఎవరైనా అన్న రీతిలో ఆమె దగ దగ మెరిసిపోతుంది. ఇవాళ జాన్వీ 27వ పుట్టిన రోజు సందర్భంగా.. శారీలో ఆమె దిగిన టాప్‌ 10 ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    రీసెంట్‌గా అనంత్‌ అంబాని – రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ సందర్భంగా జాన్వీ.. ఎలాంటి హంగులకు పోకుండా ట్రెడిషనల్‌గా చీర కట్టింది. కమర్‌బంద్‌ మోడల్ డిజైనర్ శారీకి మ్యాచింగ్‌ నెక్లెస్‌ ధరించి అందరి దృషి ఆకర్షించింది. 

    స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు జగా అందమైన రాణి పింక్ షిఫాన్ చీరను ధరించి ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఫ్రెష్‌లుక్‌తో అక్కడి వారిని మైమరిచింది. ఈ శారీలో జాన్వీ కర్లింగ్‌ హెయిర్‌ స్టైల్‌.. మెడలో ధరించిన ఆకుపచ్చని హారం ఆకట్టుకుంది.

    చీరలోనూ సొగసులను ఆరబోయచ్చని ఈ ఫొటో ద్వారా జాన్వీ నిరూపించింది. వైలెట్‌ కలర్‌ డిజైనర్‌ బ్రౌజ్‌తో హాఫ్‌శారీలో కనిపించి ఒంపుసొంపులను ప్రదర్శించింది. మెడలో ఎటువంటి హారం ధరించకుండా తన సొగసులనే ఆభరణంగా చేసుకొని కుర్రకారుకి మతి పోగొట్టింది.  

    ప్రముఖ డిజైనర్‌ మనీష్ మల్హోత్రా రూపుదిద్దిన ఈ పింక్‌ కలర్‌ శారీలో జాన్వీ కపూర్‌ దేవకన్యలా మెరిసిపోయింది. హెవీ ఎంబ్రాయిడరీ గోల్డ్‌ కలర్‌ బ్లౌజ్‌తో బంగారు అంచు కలిగిన ఈ చీర.. ఆమె అందాలను రెట్టింపు చేసింది. ఈ చీరపై ఆమె ధరించిన నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌ చూడటానికి సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి. 

    గతేడాది వినాయక చవితి సందర్భంగా జాన్వీ కట్టిన శారీని ఆమె ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు. పసుపు – బంగారపు రంగులు కలిగిన శారీలో జాన్వీ చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ముఖాన బొట్టుతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. కొప్పున పూలు సైతం పెట్టుకొని జాన్వీ ఈ శారీలో కనిపించడం విశేషం. 

    కార్సెట్ తరహా బ్లౌజ్, డైమండ్ నెక్‌లీస్‌తో కూడిన తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన బ్రౌన్ చీరలో ఓసారి జాన్వీ మెరిసిపోయింది. ఈ లేటెస్ట్‌ శారీ డిజైన్‌లో జాన్వీ తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించింది. 

    పెద్ద పెద్ద డిజైనర్‌ బ్లౌజ్‌లు, శారీలే తన అందాన్ని పెంచవని.. సాధారణ చీరలోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తానని ఈ ఫోటో ద్వారా జాన్వీ మరోమారు రుజువు చేసింది. తెల్లని పూల ప్రింట్‌తో రూపొందిన ఆర్జాన్జా శారీలో జాన్వీ పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. ఈ శారీని సమ్మర్‌ స్పెషల్‌గా చెప్పవచ్చు. 

    జాన్వీ కపూర్‌ మిస్మరైజింగ్‌ శారీ అందాల్లో ఇదీ ఒకటి. ఇందులో జాన్వీ.. ఆకుపచ్చని శారీలో రామచిలుకలా అందంగా మెరిసిపోయింది. తన అందంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. ముఖ్యంగా చెవులకు ధరించిన ఎర్రటి చమ్కీలు ఈ శారీలో ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. 

    ఈ స్టైలిష్‌ రెడ్ శారీలో జాన్వీ కపూర్‌.. ఘాటైన రెడ్‌ మిర్చిలా మెరిసిపోయింది. బోసిపోయిన మెడ దిగువన ఎద అందాలను ప్రదర్శించింది. డిజైనర్‌ అంచుతో వచ్చిన ఈ చీరలో జాన్వీ లుక్స్‌ నెవర్‌ బీఫోర్‌లా అనిపిస్తాయి. 

    జాన్వీ ధరించిన ఈ చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆకుపచ్చని బంధాని మోడల్‌ శారీని చేతితో తయారు చేయడం విశేషం. బ్లాక్‌ కలర్‌ బ్లౌజ్‌తో మ్యాచింగ్‌ హారం ధరించి జాన్వీ కుందనపు బొమ్మలా కనిపించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version