టాలీవుడ్‌కు హీరోయిన్స్ కొత్త కాదు. సినిమా సినిమాకు కొత్త భామలు పరిచయమవుతూనే ఉంటారు. అందం, అభినయంతో మెప్పించిన వారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగితే మరికొందరు మాత్రం సత్తా చాటలేక కనుమరుగవుతుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15 సందర్భంగా ఇద్దరు హీరోయిన్స్ తెలుగు తెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse), ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో కావ్యా థాపర్ (Kavya Thapar) తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. కావ్య థాపర్ ఇప్పటికే తెలుగులో నాలుగు సినిమాలు చేయగా భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం ఇదే ఫస్ట్ ఫిల్మ్. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో ఎవరి విజయవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
భాగ్యశ్రీ బోర్సే
అందానికి కేరాఫ్‌గా భాగ్యశ్రీ!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్‌లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఒక్కో ఈవెంట్‌లో ఒక్కోరకమైన లుక్‌తో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ఈవెంట్‌లో చీర కట్టులో ట్రెడిషనల్‌గా కనిపించి, మరో ఈవెంట్‌లో మోడ్రన్ డ్రెస్‌లో కళ్లు చెదిరే గ్లామరస్‌గా కనిపిస్తోంది. అటు ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ కూడా ఈ బ్యూటీని హైలెట్ చేస్తోంది. ప్రతీ ప్రమోషన్స్‌లో ఈ అమ్మడిని పాల్గొనేలా చేస్తూ సినిమాపై యూత్‌లో అంచనాలు పెంచేస్తోంది. ఈ హాట్ బ్యూటీ కూడా దొరికిందే ఛాన్స్ అని తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రమోషన్స్‌కు సరికొత్త అందాలు తీసుకొస్తోంది. ఇదే బెస్ట్ ఛాన్స్‌గా భావిస్తూ దూసుకెళ్తోంది.
హరీష్ శంకర్ మార్క్!
‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్, టీజర్, ప్రమోషన్ పోస్టర్స్ గమనిస్తే భాగ్యశ్రీ ఇందులో గ్రామరస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన ఈ అమ్మడు అదిరిపోయే ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. పైగా హీరోయిన్స్‌ను చూపించడంలో డైరెక్టర్ హరీష్ శంకర్‌కు మంచి పేరుంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిరపకాయ్’లో ఇద్దరు హీరోయిన్స్‌తో ఏ స్థాయిలో ఎంటర్‌టైన్ చేశారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ నుంచి భారీ ఎత్తున అందాల ఆరబోత ఉండే అవకాశముంది. ఈ చిత్రం ద్వారా భాగ్యశ్రీకి సరైన స్టార్ట్ లభిస్తే ఇండస్ట్రీలో ఈ అమ్మడికి తిరుగుండదని చెప్పవచ్చు. పైగా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం భాగ్యశ్రీకి కలిసిరానుంది.
చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్
ఒక్క మూవీ రిలీజ్ కానప్పటికీ భాగ్యశ్రీ బోర్సేతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు తెగ పోటీ పడుతున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ దశలో ఉండగానే అదిరిపోయే ఆఫర్లు భాగ్యశ్రీ దక్కాయి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో వస్తోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ఈ మూవీ షూటింగ్‌లో కూడా భాగ్యశ్రీ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే నాని – భాగ్యశ్రీ కాంబోపై అధికారిక ప్రకటన సైతం రానుంది. ఇలా డెబ్యూ రిలీజ్ కాకుండానే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుసగా రెండు బ్లాక్ బాస్టర్లు వస్తే టాలీవుడ్‌లో భాగ్యశ్రీ టాప్ హీరోయిన్‌గా మారడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం ‘యారియాన్ 2’తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
కావ్య థాపర్
కావ్య థాపర్ హల్‌చల్!
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కావ్యథాపర్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ‘ఈ మాయ పేరేమిటో’, ‘ఏక్ మినీ కథ’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలు చేసినప్పటికీ ఈ అమ్మడికి బ్రేక్ రాలేదు. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సక్సెస్‌పై కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. అంతేకాదు అందాల ప్రదర్శనకు సైతం ఏమాత్రం వెనకాడలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్, లిరికల్ సాంగ్ వీడియోలు, ప్రమోషన్ పోస్టర్స్ చూస్తే కావ్య థాపర్ ఎంతో హాట్‌గా కనిపించింది. గ్లామరస్ లుక్, కళ్లు చెదిరే హాట్ స్టెప్పులతో యూత్‌ను కట్టిపడేసింది. అంతకాదు లిప్‌లాక్ సీన్‌లోనూ నటించి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అన్ని అనుకున్నట్లు జరిగి డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ అయితే కావ్య థాపర్ స్టార్ హీరోయిన్‌గా మారడం పక్కా అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో..
గోపిచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వం‘ చిత్రంలో కావ్య థాపర్‌గా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకూ ఇటలీలో నిర్వహించారు. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘పుష్ప 2’లో ఓ స్పెషల్ సాంగ్‌లో కావ్య థాపర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యూత్‌లో ఈ భామ అందాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఐటెం సాంగ్‌ను కావ్య చేయిస్తే ఎలా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వచ్చే ఛాన్స్ ఉందట. వీటితో పాటు మరిన్ని అవకాశాలు కావ్య కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
కావ్య థాపర్ నేపథ్యం ఇదే!
మహారాష్ట్రకు చెందిన కావ్య థాపర్ 2013లో ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ‘ఏక్ మినీ కథా’ మూవీలోనూ అమృతగా కనిపించి కావ్య మెప్పించింది. ఆ తర్వాత క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) వెబ్‌సిరీస్‌లలో నటించి అలరించింది. ‘ఈగల్’, ‘ఊరి పేరు భైరవకోన’ చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించింది. కాగా, సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీ బిజీగా ఉంటోంది.తన గ్లామర్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.