కొరటాల శివ మిర్చి సినిమాతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అంతకుముందు కొన్ని సినిమాలకు రైటర్‌గా పనిచేశాడు. భద్ర, ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, సింహా, ఊసరవెల్లి వంటి సినిమాలకు కథలను అందించాడు. కొరటాల శివ ప్రతి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ దాన్ని కమర్షియల్‌గా తెరకెక్కిస్తాడు.
1.మిర్చి
మిర్చి మూవీతో ప్రభాస్‌ను మరోసారి చత్రపతి నాటి మాస్ హీరోను గుర్తుచేశాడు. ఆ సినిమాలో రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలను మాట్లాడుకొని ముగించవచ్చు అనే కోణాన్ని చాలా కొత్తగా చూపించాడు. ఈ సినిమా కమర్షియల్ పెద్ద సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతో కొరటాల హిట్ కొట్టడంతో బడా హీరోలకు అతడిపై నమ్మకం పెరిగింది.
2.శ్రీమంతుడు
రెండో సినిమా మహేశ్‌బాబుతో శ్రీమంతుడు తెరకెక్కించాడు. ఇందులో కూడా కార్పొరేట్ శక్తులు గ్రామాలను ఎలా నాశనం చేస్తున్నాయి. అక్కడ ఉండే ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు చూపించే ప్రయత్నం చేశాడు. గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్ నుంచే ప్రారంభమైందనే చెప్పుకోవాలి. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మహేశ్‌బాబు కొరటాలకు ఒక లగ్జరీ కారు గిఫ్టుగా ఇచ్చాడు.
3.జనతా గ్యారేజ్
ఇక మూడో సినిమా జనతా గ్యారేజ్‌తో ఎన్‌టీఆర్‌లోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఈ కథతో చెట్లు నరికివేయడంతో వాతావరణం ఎంత నాశనం అవుతుంది. దాని కోసం యువత ఏ విధంగా పోరాడాలో చూపించాడు. మోహన్‌లాల్ నటించిన పాత్రకు మంచి పేరు లభించింది. ఎన్‌టీఆర్ పచ్చదనం కోసం ప్రయత్నిస్తుంటే, మోహన్‌లాల్ అవినీతి చేసేవారిని తన స్టైల్‌లో అంతమొందించే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాడు. వరుసగా మూడు హ్యాట్రిక్‌లతో అగ్ర డైరెక్టర్‌ల సరసన చేరాడు కొరటాల.
4.భరత్ అనే నేను
నాలుగో సినిమా భరత్ అనే నేను. కొరటాలపై నమ్మకంతో మహేశ్ బాబు మరోసారి చాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని 100 శాతం నిలబెట్టుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో సూపర్ స్టార్‌ని మొదటిసారిగా స్టైలిష్ సీఎం పాత్రలో చూడవచ్చు. ఇక ట్రాఫిక్ రూల్స్ , గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం వంటి చాలా అంశాలను టచ్ చేశాడు. మహేశ్ కెరీర్‌లో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
5.ఆచార్య
అయితే ఐదో సినిమా ఆచార్య మాత్రం కొరటాలకు నిరాశను మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ఇద్దరి కాంబినేషన్స్ పెద్ద హిట్ కొట్టాలనుకునే ప్రయత్నంలో కథ గాడి తప్పింది. ఆచార్య బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే వరుసగా హిట్‌లు చూసిన తర్వాత ఫ్లాప్ ఎదురవడంతో తన తప్పేంటో తెలుసుకునే ప్రయత్నంలో మునిగిపోయాడు కొరటాల. ఇప్పుడు ఎన్‌టీఆర్ 30 సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్‌టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం