Kushita Kallapu: యంగ్‌ బ్యూటీ ‘కుషిత కల్లపు’ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kushita Kallapu: యంగ్‌ బ్యూటీ ‘కుషిత కల్లపు’ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    Kushita Kallapu: యంగ్‌ బ్యూటీ ‘కుషిత కల్లపు’ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    March 7, 2024

    టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ‘కుషిత కల్లపు’ పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో లిప్‌కిస్‌ కైనా తాను సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకూ నాలుగు సినిమాలు చేసిన ‘కుషిత కల్లపు’కు సంబంధించిన పూర్తి సమాచారం, ఆమె ఇష్టా ఇష్టాలు, అభిరుచులు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

    కుషిత కల్లపు పుట్టిన తేది?

    19 అక్టోబర్‌, 2002 శనివారం రోజున హైదరాబాద్‌లో కుషిత కల్లపు జన్మించింది. 

    కుషిత కల్లపు వయసు ఎంత?

    19 అక్టోబర్‌, 2002లో పుట్టినందను ప్రస్తుతం ఆమె వయసు 24 ఏళ్లు

    కుషిత కల్లపు తల్లిదండ్రులు ఎవరు?

    ఈ బ్యూటీ తన కుటుంబ సభ్యుల సమాచారంపై గోప్యత పాటిస్తోంది. తన తల్లిదండ్రుల నేపథ్యం, వృత్తి వంటి విషయాలను ఆమె ఎక్కడా పంచుకోలేదు. 

    కుషిత కల్లపు మతం ఏది?

    ఆమె హిందువు

    కుషిత కల్లపుది ఏ రాశి?

    మిధున రాశి

    కుషిత కల్లపు ఎత్తు ఎంత?

    ఈ బ్యూటీ 5.5  అడుగుల ఎత్తు కలిగి ఉంది. 

    కుషిత కల్లపు బరువు ఎంత?

    ఈ భామ సుమారు 65 కిలోల బరువు ఉంది. 

    కుషిత కల్లపు కళ్లు, జట్టు ఏ కలర్‌?

    నలుపు

    కుషిత కల్లపు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా?

    https://www.instagram.com/kushithakallapu/

    కుషిత కల్లపునకు పెళ్లి అయ్యిందా?

    లేదు

    కుషిత కల్లపు తొలి సినిమా?

    ‘నీతోనే నేను’  సినిమాతో కుషిత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘మనోహరం’, ‘చాంగురే బంగారు రాజా’ సినిమాల్లో నటించింది. 

    కుషిత కల్లపు తాజా చిత్రం ఏది?

    బిగ్‌బాస్‌ ఫేమ్‌ అర్జున్‌ కళ్యాణ్‌ హీరోగా లక్ష్మణ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం.1 బుల్‌షిట్‌ గాయ్‌’. ఇందులో కుషిత హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానుంది. 

    సినిమాల్లోకి రాకముందు కుషిత ఏం చేసింది?

    టాలీవుడ్‌లోకి అడుగు పెట్టకముందు కుషిత పలు షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది. 

    కుషిత కల్లపు చేసిన షార్ట్‌ఫిల్మ్స్‌?

    డేట్‌మింటన్‌ (Dateminton), 3G, ఫ్రెండ్స్‌ విత్‌ బెనిఫిట్స్‌ (Friends with Benefits), డేట్‌ వంటి లఘు చిత్రాల్లో కుషిత చేసింది. 

    కుషిత కల్లపు ఫేవరేట్‌ హీరో?

    కుషిత కల్లపు తన ఫేవరేట్‌ హీరో ఎవరో ఏ వేదికపై వెల్లడించలేదు. అయితే పవన్‌తో లిప్‌కిస్‌కు రెడీ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని బట్టి ఆమె ఫేవరేట్‌ హీరో పవర్‌స్టార్‌ అయ్యి ఉండవచ్చు. 

    కుషితను బాగా బాధ పెట్టిన ఘటన?

    మహేష్‌ బాబు రీసెంట్‌ చిత్రం ‘గుంటూరు కారం’ షూటింగ్‌లో కుషిత పాల్గొంది. నాలుగు రోజులు షూటింగ్‌ కూడా చేసిందట. అయితే తన సీన్స్‌ ఎడిటింగ్‌లో పోవడంతో తాను చాలా బాధపడినట్లు కుషిత ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది. 

    కుషిత కల్లపు హాబీ?

    ట్రావెలింగ్‌ అంటే భామకు చాలా ఇష్టమట. ఖాళీ దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాల్లో వాలిపోతుందట. 

    కుషిత కల్లపు ఫేవరేట్‌ ఫుడ్‌?

    ఛీజ్‌తో చేసిన వంటకాలంటే తనకు చాలా ఇష్టమైన ఇటీవల ఓ ఇంటర్యూలో కుషిత చెప్పుకొచ్చింది. 

    కుషిత కల్లపు ముద్దు పేరు ఏంటి?

    కుటుంబ సభ్యులు ఈ బ్యూటీని ముద్దుగా ‘ఖుషి’ అని పిలుస్తారట. అలా పిలిపించుకోవడం కుషితకు చాలా ఇష్టమట.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version