List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!

    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!

    May 10, 2024

    సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైనా హార్రర్‌ చిత్రాలు (Comedy And Horror Movies In Telugu).. ప్రేక్షకులను భయపెడతాయి. ఒంటరిగా చూడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తాయి. అయితే టాలీవుడ్‌లో వచ్చిన కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. ఓ వైపు భయపెడుతూనే ఆడియన్స్‌ను నవ్విస్తాయి. దెయ్యం సినిమాలంటే వణికిపోయే వారు సైతం ఈ చిత్రాలను ఎంచక్కా చూసేయచ్చు. అంతేకాదు అందులోని దెయ్యాలు చేసే కామెడీని బాగా ఎంజాయ్‌ చేయవచ్చు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన ఆ హార్రర్‌ & కామెడీ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    బాక్‌ (Baak)

    తెలుగులో వచ్చిన రీసెంట్‌ హార్రర్‌ కామెడీ చిత్రం ‘బాక్‌’. తమన్నా, రాశి ఖన్నా, సుందర్‌ సి, శ్రీనివాస్‌ రెడ్డి, కోవై సరళ, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఓ వైపు దుష్టశక్తిని చూపిస్తూనే హాస్య నటులతో కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు దర్సకుడు. కథ విషయానికి వస్తే.. శివ శంకర్ (సుందర్ సి) ఒక లాయర్. బాక్‌ అనే దుష్టశక్తి వల్ల అతని చెల్లెలు శివాని (తమన్నా) మరణిస్తుంది. అసలు ఆ బాక్ ఎవరు? శివాని ఫ్యామిలీని ఎందుకు టార్గెట్‌ చేసింది? శివాని ఆత్మగా మారి తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కథలో మాయ (రాశి ఖన్నా) పాత్ర ఏంటి? అన్నది కథ.

    ఓటీటీ వేదిక: జీ 5

    గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)

    అంజలి (Ajali), శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. దర్శకుడు శివ తుర్లపాటి.. ఈ సినిమాను హార్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ప్రస్తుతం ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. మూవీ కథ ఏంటంటే.. డైరెక్టర్‌ శ్రీను (శ్రీనివాస రెడ్డి) కొత్త సినిమా కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి సత్య, అంజలి హీరో హీరోయిన్లుగా సినిమా చేసే ఛాన్స్ వస్తుంది. అయితే నిర్మాత దెయ్యాల కోటగా పేరున్న సంగీత్‌ మహల్‌లోనే షూటింగ్‌ చేయాలని షరతు విధిస్తాడు. ఇంతకీ, ఆ సంగీత్ మహల్ గతం ఏమిటి? అక్కడ మూవీ టీమ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.

    ఓటీటీ వేదిక: ఆహా

    ఓం భీమ్‌ బుష్‌ (Om Bheem Bush)

    ఈ చిత్రం కూడా హాస్యాన్ని ప్రాధాన్యంగా చేసుకొని వచ్చింది. దర్శకుడు హర్ష కొనుగొంటి ఓ వైపు దయ్యాన్ని చూపిస్తూనే దాని చుట్టూ కామెడీ ట్రాక్‌ను అల్లి నవ్వించాడు. ఇందులో శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) లీడ్‌ రోల్స్‌లో చేశారు. కథ ఏంటంటే.. క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.

    ఓటీటీ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌

    ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona)

    యంగ్‌ హీరో సందీప్‌ కిషన్ (Sundeep Kishan), వర్ష బొల్లమ్మ జంటగా చేసిన ఈ చిత్రాన్ని (Comedy And Horror Movies In Telugu) వి. ఆనంద్‌ తెరకెక్కించారు. ఇందులో చనిపోయి చాలా కాలమైన వెన్నెల కిషోర్‌.. బతికున్న సందీప్‌, హర్షతో చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. కథ ఏంటంటే.. ప్రేయసి కోసం ఒక పెళ్లిలో నగలు దొంగతనం చేసిన బసవ (సందీప్ కిషన్).. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన గ్యాంగ్‌తో భైరవకోనకు పారిపోతాడు. అయితే ఆ ఊరికి వెళ్లినవారు ఎవరూ ప్రాణాలతో బయటకు వచ్చింది లేదు. మరి అక్కడ బసవకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరి మిస్టరీ ఏంటి? అన్నది కథ.

    ఓటీటీ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌

    డీడీ రిటర్న్స్‌ (DD Returns)

    తమళంలో రూపొందిన డీడీ రిటర్న్స్‌ చిత్రాన్ని తెలుగులోనూ డబ్‌ చేశారు. హాస్య నటుడు సంతానం ఇందులో హీరోగా చేశాడు. ఓ దెయ్యం బంగ్లా చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. మంచి హార్రర్‌ కామెడీని ఎంజాయ్‌ చేయాలని కోరుకునేవారు ఈ మూవీ చూడవచ్చు. మూవీ ప్లాట్‌ ఏంటంటే.. కొంద‌రు ఫ్రెండ్స్ తాము దొంగిలించిన కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు, నగలను ఓ భూతాల బంగ్లాలో పోలీసుల కంటపడకుండా దాచిపెడ‌తారు. ఆ బ్యాగ్‌ను తిరిగి బంగ్లా నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో దెయ్యం వారికి కొన్ని పరీక్షలు పెడుతుంది. అప్పుడు వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది కథ

    ఓటీటీ వేదిక: జీ 5

    ప్రేమ కథా చిత్రం (Prema Katha Chitram)

    తెలుగులో మంచి ఆదరణ సంపాదించిన హాస్య భరిత హార్రర్‌ సినిమా ఇది. మారుతీ దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం.. అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం ద్వారానే హాస్ట నటుడు సప్తగిరి స్టార్‌గా మారిపోయాడు. స్టోరీ విషయానికి వస్తే.. ఓ యువతి ముగ్గురు యువకులు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంతా కలిసి ఓ గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. కానీ ఆ ఇంట్లో వారి ప్లాన్లన్నీంటిని కొన్ని సంఘటనలు అడ్డుకుంటాయి. ఎంటా సంఘటనలు? ఇంతకు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనకున్నారన్నది మిగతా కథ.

    ఓటీటీ వేదిక: హాట్‌స్టార్‌

    రాజు గారి గది (Raju Gari Gadhi)

    యాంకర్‌ ఓం కార్‌  (Comedy And Horror Movies In Telugu) తొలిసారి దర్శకుడిగా మారి చేసిన చిత్రం ‘రాజు గారి గది‘. సోదరుడు అశ్విన్‌ను హీరోగా పెట్టి ఈ మూవీ తీశాడు. ఈ మూవీలో ధన్‌రాజ్‌, సప్తగరి, షకలక శంకర్‌, విద్యుల్లేఖ చేసే కామెడీ గిలిగింతలు పెడుతుంది. స్టోరీ ఏంటంటే.. గుప్త నిధిని కనిపెట్టే లక్ష్యంతో ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం.. రాజు గారి గది అనే భూత్ బంగ్లాలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి భయానక అనుభవాలు, వింతలు ఎదురవుతాయి. వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది స్టోరీ. 

    ఓటీటీ వేదిక: హాట్‌స్టార్‌

    గంగ (Ganga) 

    రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘గంగ’.. సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇందులో కెమెరామెన్‌గా లారెన్స్‌ చేసే కామెడీ నవ్వులు పూయిస్తోంది. అటు దెయ్యంగానూ లారెన్స్ భయపెడతాడు. ‘రాఘవ.. గ్రీన్ టీవీలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. అదే చానల్‌లో పని చేసే నందినిని ప్రేమిస్తాడు. వారు తమ టీమ్‌తో కలిసి దెయ్యాల మీద ఓ ప్రోగ్రాం తీసేందుకు బీచ్‌ పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ బంగాళాలోకి వెళతారు. అక్కడ ఉన్న బీచ్‌లో నందినికి ఒక తాళి బొట్టు దొరుకుతుంది. ఆ తాళిబొట్టు దొరికిన రోజు నుంచీ నందిని లైఫ్‌లో భయానక సంఘటనలు జరుగుతుంటాయి.

    ఓటీటీ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌

    ఆనందో బ్రహ్మా (Anando Brahma)

    ఈ హార్రర్‌ చిత్రం కూడా హాస్యాన్ని ఆధారంగా చేసుకొని రూపొందింది. మహి వి. రాఘవ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో తాప్సీ (Taapsee Pannu), శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy), షకలక శంకర్‌, వెన్నెల కిషోర్‌, రఘు ముఖ్య పాత్రలు చేశారు. ‘ఒక ఎన్నారై తన బంధువులకు సంబంధించిన దెయ్యాల ఇంటిని అమ్మాలని చూస్తాడు, కానీ అక్కడ ఉండే దెయ్యాలకు భయపడి ఎవరూ ఆ ఇంటిని కొనేందుకు రారు. దీంతో ఆ ఎన్నారై ఓ ఉపాయం ఆలోచిస్తాడు’ అన్నది ఈ మూవీ స్టోరీ.

    ఓటీటీ వేదిక: జీ 5

    ఎక్కడికి పోతావు చిన్నవాడా (Ekkadiki Pothavu Chinnavada)

    యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil)కెరీర్‌లో వచ్చిన ఫస్ట్‌ హార్రర్‌ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రం మిమ్మల్ని భయపెట్టడం కంటే ఎక్కువగా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్, సత్య, హర్ష చెముడు చేసే కామెడీ మూవీకి బాగా ప్లస్‌ అయ్యింది. కాగా, ఇందులో హెబ్బా పటేల్‌, నందితా శ్వేత, అవికా గోర్‌ కథానాయికలుగా చేశారు. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే.. ఆత్మ చేత పీడించబడుతున్న తన ప్రేయసిని హీరో (నిఖిల్‌) ఎలా కాపాడాడు. అసలు ఆ ఆత్మకు హీరోకు ఉన్న సంబంధం ఏమిటీ? అన్నది కథ.

    స్ట్రీమింగ్‌ వేదిక: యూట్యూబ్‌

    మరకతమణి (Marakathamani)

    ఆది పినిశెట్టి కెరీర్‌లోనే గుర్తుండిపోయే చిత్రం ‘మరకతమణి. ఈ సినిమా మరకతమణి అనే డైమండ్‌ చుట్టూ తిరుగుతుంది. దానికి సంపాదించేందుకు హీరోకు ఆత్మలు సాయం చేస్తాయి. ఈ క్రమంలో వచ్చే ఫన్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కథ ఏంటంటే.. రఘునందన్‌ (ఆది)కు రూ.10 కోట్ల డీల్ వస్తుంది. మరకతమణిని అప్పగిస్తే ఆ మెుత్తం ఇచ్చేందుకు డీల్‌ కుదురుతుంది. అయితే ఆ రత్నం కోసం ప్రయత్నించిన వారిని ఓ వాహనం యాక్సిడెంట్ చేసి చంపేస్తుంది. మరోవైపు ట్వింకిల్‌ రామనాదం అనే రౌడీ కూడా ఆ డైమెండ్ కోసం వెతుకుతుంటాడు. చివరికీ ఏమైంది? అన్నది కథ.

    ఓటీటీ వేదిక: సన్‌ నెక్స్ట్‌

    చంద్రముఖి 2 (Chandramukhi 2)

    రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా చేసిన చంద్రముఖి చిత్రానికి (Comedy And Horror Movies In Telugu) ఈ మూవీ సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రాఘవ లారెన్స్‌ హీరోగా చేశాడు. ఈ మూవీ ప్రథమార్థం మెుత్తం లారెన్స్‌ తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తాడు. స్టోరీ విషయానికి వస్తే.. రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. ఆ ఫ్యామిలీని అనుకోని సమస్యలు వరుసగా చుట్టుముడతాయి. కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయని స్వామీజీ చెప్తారు. ఆ గుడికి దగ్గర్లో చంద్రముఖి బంగ్లా ఉండటంతో ఫ్యామిలీ అంతా కుటుంబంతో అక్కడ అద్దెకు దిగుతారు. ఆ తర్వాత వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? బంధువుల తరపున వచ్చిన రాఘవ లారెన్స్ దుష్టశక్తికి ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.

    ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

    కథ కంచికి మనం ఇంటికి (Katha Kanchiki Manam Intiki)

    హార్రర్‌ కామెడీని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. త్రిగణ్‌, పూజిత పొన్నాడ జంటగా చాణక్య చిన్నా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ‘ప్రేమ్‌ (త్రిగుణ్‌), దీక్ష(పూజిత పొన్నాడ), నంది(ఆర్జే హేమంత్‌), దొంగేష్‌ (గెటప్‌ శ్రీను) అనుకోకుండా ఓ రోజు శ్మశానంలో కలుసుకుంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గెస్ట్‌హౌస్‌లోకి వెళ్తారు. అక్కడ దయ్యం వీరిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసింది? చైల్డ్ ట్రాఫికింగ్‌తో ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి’ అన్నది కథ.

    ఓటీటీ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌

    చీకటి గదిలో చితక్కొట్టుడు (Chikati Gadilo Chithakotudu)

    ఈ సినిమా హార్రర్‌ కంటెంట్‌తో వచ్చినప్పటికీ కాస్త బోల్డ్‌గా తెరకెక్కించారు. కామెడీ కూడా పెద్దవారికి మాత్రమే అన్నట్లుగా ఉంటుంది. సంతోష్‌ పి. జయకుమార్‌ దర్శకత్వం వహించగా త్రిగన్‌, నిక్కీ తంబోలి, భాగ్యశ్రీ మోతే, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్‌, హేమంత్‌ ముఖ్య పాత్రలు చేశారు. మూవీ ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.

    ఓటీటీ వేదిక: ఆహా

    జాంబి రెడ్డి (Zombie Reddy)

    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా చేసిన వినూత్న ప్రయోగాత్మక చిత్రం ‘జాంబి రెడ్డి’. ఇందులో దయ్యాలు లేకపోయిన వాటిలాగే కనిపించే జాంబీలు ప్రేక్షుకలను భయపెడతాయి. అయితే ఆ భయం కంటే ఇందులో కామెడీనే ఎక్కువగా ఉంటుంది. హాస్య నటుడు గెటప్‌ శ్రీను ఇందులో అదరగొట్టాడు. ‘మారియో (తేజ సజ్జ) ఓ గేమ్‌ డిజైనర్‌. స్నేహితుడు కల్యాణ్‌ (హేమంత్‌) పెళ్లికి తన గ్యాంగ్‌తో రుద్రవరానికి వెళ్తాడు. అక్కడకు వెళ్లిన వారికి అనూహ్య పరిణామం ఎదురవుతుంది. ఫ్రెండ్స్‌లోని కిరీటీ జాంబీలాగా మారిపోతాడు. అతడు ఎందుకు అలా అయ్యాడు? ఊరు మెుత్తం జాంబీల్లాగా మారడానికి కారణం ఏంటి? వారిని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? అన్నది కథ.

    ఓటీటీ వేదిక: ఆహా

    కాష్మోరా (Kaashmora)

    తమిళ నటుడు కార్తీ (Karthi) హీరోగా చేసిన ‘కాష్మోరా’ చిత్రం డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ఇందులో కార్తీ దయ్యాల పేరుతో భయపెట్టి ప్రజలను మోసం చేస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. మూవీ ప్లాట్‌ విషయానిసి వస్తే.. కాష్మోరా(కార్తీ) దెయ్యాల వద్దకు తీసుకెళ్లడానికి కొన్ని ప్రత్యేక శక్తులను కలిగి ఉన్నట్లు నటించే ఒక చిన్న దొంగ. అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని మోసం చేసి అతని డబ్బుతో పారిపోతాడు. ఈక్రమంలో ఏడు వందల ఏళ్లనాటి ఓ పాడుబడ్డ దెయ్యాల భవనంలో అతను చిక్కుకుంటాడు.

    ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్‌

    రాక్షసుడు (Rakshasudu)

    వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం (Comedy And Horror Movies In Telugu)లో హీరో సూర్య (Suriya)కు ఆత్మలు కనిపిస్తాయి. దీంతో దయ్యాలను అడ్డం పెట్టుకొని మనుషుల భయాలతో ఆడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో జనరేట్‌ ఫన్‌ ఆడియన్స్‌కు గిలిగింతలు పెడుతుంది. స్టోరీ ఏంటంటే.. మాస్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఓ యాక్సిడెంట్‌ వల్ల అతడికి ఆత్మలు కనిపించడం మెుదలవుతాయి. దయ్యాలకు హెల్చ్‌ చేస్తూ తాను ప్రయోజనం పొందుతూ సాఫీగా జీవితాన్ని గడుపుతుంటాడు మాస్. ఓ రోజు అతడి లైఫ్‌లోకి శివ కుమార్ (సూర్య) ఆత్మ ఎంటర్ అవుతుంది. అసలు ఈ శివ ఎవరు? మాస్‌ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది? అన్నది కథ.

    ఓటీటీ వేదిక: జీ 5

    ముని (Muni)

    రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో ఫస్ట్ హార్రర్ చిత్రం ‘ముని’ ఈ సినిమాలో లారెన్స్‌ కథనాయకుడిగా చేశాడు. ఇందులో హీరో చీకటి అంటే భయపడుతుంటాడు. తల్లి కోవై సరలాను భయం పేరుతో విసిగిస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. మూవీ ప్లాట్‌లోకి వెళ్తే.. ‘చీకటి అంటే భయపడే గణేష్‌ (లారెన్స్‌)లోకి ముని అనే ఆత్మ ప్రవేశిస్తుంది. దీంతో అతడు వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఇంతకూ ఆ ఆత్మ ఎవరు? మునికి జరిగిన అన్యాయం ఏంటి? మునికి గణేష్ చేసిన సాయం ఏంటి? అన్నది కథ. 

    ఓటీటీ వేదిక: ఈటీవీ విన్‌

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version