Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?

    Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?

    April 19, 2024

    నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు

    దర్శకత్వం : వియస్ ముఖేష్

    సంగీతం: జో ఎన్మవ్  

    నేపథ్య సంగీతం: సృజన శశాంక

    సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల

    ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి

    నిర్మాత: అఖిలేష్ కలారు

    విడుదల తేది: ఏప్రిల్‌ 19, 2024

    కేరింత’ ఫేమ్‌ పార్వతీశం నటింటిన లేటెస్ట్‌ చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్‌ ముఖేష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్‌ 19) విడులైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం. 

    కథేంటి

    ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పని చేసే కేదార్‌ శంకర్‌ కొడుకును (పార్వతీశం) కష్టపడి సాఫ్ట్‌వేర్‌ ఇంజీనీర్‌ చేస్తాడు. లక్షల్లో జీతం వస్తున్న కుమారుడికి రూ.కోటి కట్నం ఇచ్చే యువతితో పెళ్లి చేసేందుకు యత్నిస్తాడు. అయితే పార్వతీశం మాత్రం మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? సాఫ్ట్‌వేర్ అయిన పార్వతీశం.. మహాలక్ష్మీనే ఎందుకు ప్రేమించాడు? కొడుకు ప్రేమ వ్యవహారం తెలిసి కేదార్ శంకర్‌ ఏం చేశాడు? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో పార్వతీశం చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. అటు మార్కెట్‌ మహాలక్ష్మీ పాత్రలో ప్రణికాన్విక ఒదిగిపోయింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. అటు పార్వతీశం ఫ్రెండ్‌ పాత్రలో ముక్కు అవినాష్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తిలా మహబూబ్‌ బాషా నవ్వులు పూయించాడు. హీరోయిన్‌ సోదరుడిగా అతడు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. జయ, పద్మ, కేదార్‌ శంకర్‌, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటింటి ఆకట్టుకున్నారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    దర్శకుడు వీఎస్‌ ముఖేష్‌ కొత్త తరహా ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య లవ్‌ మెుదలైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో కథను నడిపించాడు. మహిళా సాధికారత ఎంత అవసరమో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. అయితే మహాలక్ష్మీ ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడ మరింత కామెడీ పండించే అవకాశమున్నా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌ను బలమైన సన్నివేశాలతో నడిపించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. 

    టెక్నికల్‌గా

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి.. జో ఎన్మవ్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చక్కగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్‌లోని సన్నివేశాలు మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • హీరో, హీరోయిన్‌ నటన
    • సందేశం
    • డైలాగ్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటీన్‌ లవ్‌ ట్రాక్‌
    • సాగదీత సన్నివేశాలు

    Telugu.yousay.tv Rating : 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version