మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కౌంపౌండ్‌లో సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన సుఖంగా ప్రసవించారు. ఉపాసన డెలివరీ ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో జరిగింది. ఈ క్రమంలో జూన్ 23న మధ్యాహ్నం ఉపాసన డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో తొలిసారి బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చారు. ఈ తరుణంలో రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడి పలు విషయాలను పంచుకున్నాడు.
పూలతో వెల్‌కం..
రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆసుపత్రి నుంచి అడుగు పెట్టిన సమయంలో అభిమానులు వారిపై పూలాభిషేకం కురిపించారు. వెల్ కం టు మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఉత్సాహాన్ని చూపించారు. ఉపాసనకు సాధారణ ప్రసవం చేయడంతో మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.
దిష్టి తగలకుండా..
నవజాత శిశువులకు సాధారణంగానే దిష్టి తగులుతుందని అంటుంటారు. మరి, మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు రామ్ చరణ్, ఉపాసన. ఆసుపత్రి నుంచి బయటకు తెస్తుండగా అప్రమత్తంగా ఉన్నారు. బిడ్డకు తెల్లటి వస్త్రాన్ని చుట్టి తీసుకొచ్చారు. బేబీ మొఖం కనిపించకుండా చెర్రీ, ఉప్సి తమ చేతులను అడ్డంగా పెట్టుకున్నారు. మీడియాకు ఏమాత్రం కూడా బేబీ మొఖాన్ని చూపించలేదు.
లిటిల్ ప్రిన్సెస్ పేరు?
ఇప్పటికే తమ కూతురి పేరును ఫిక్స్ చేసినట్లు రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేను, ఉపాసన ఇప్పటికే ఒకట్రెండు పేర్లు అనుకున్నాం. సరైన సమయంలో మా బిడ్డ పేరుని నేనే స్వయంగా వెల్లడిస్తా’ అని చెప్పాడు చెర్రీ. మరి, ఆ పేరు ఏంటా అని అప్పుడే నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. మంగళవారం పుట్టడం, మెగా ఫ్యామిలీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దేవత పేరు కలిసొచ్చేలా నామకరణం చేసే అవకాశం ఉంది.
పట్టరాని ఆనందం..
కుమార్తె పుట్టిన విషయం తెలిశాక మీ ఫీలింగ్ ఏంటని ఓ విలేకరి ప్రశ్నించారు. ప్రతి మగవాడు తొలిసారి తండ్రయితే ఎలాంటి అనుభూతి చెందుతాడో తనూ అలాగే ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. బిడ్డను చూడగానే పట్టరాని సంతోషం వేసిందని చెప్పాడు. 21 రోజుల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని వెల్లడించాడు చెర్రీ.
ఎవరి పోలికంటే?
బిడ్డ పుడితే ఎవరి పోలికా? అనే ప్రశ్న ఎదురవడం సర్వ సాధారణం. కొందరు అమ్మ పోలికలతో పుడతారు. మరికొందరికి నాన్న పోలికలు వస్తాయి. ఇంకొందరికి అమ్మమ్మ/నానమ్మ, తాతయ్యల పోలికలు వస్తాయి. ఇదే ప్రశ్న రామ్‌చరణ్‌కు ఎదురైంది. పాప ఎవరి పోలిక అని ఓ విలేకరి అడిగారు. దీంతో ‘కచ్చితంగా నాన్న పోలికే’ అంటూ గర్వంగా చెబుతూ వెంటనే బయలు దేరారు.
బొడ్డు పేగు రక్తం ప్రిజర్వ్..
పాప బొడ్డు పేగు రక్తాన్ని భద్రపరిచినట్లు తెలుస్తోంది. బిడ్డ జన్మించాక బొడ్డు పేగును కత్తిరించి తల్లి నుంచి వేరు చేస్తారు. ఇలా కత్తిరించిన పేగులో రక్తకణాలు ఉంటాయి. ఇవి చికిత్సకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులపై పోరాడటానికి సహాయపడతాయి. అందుకే ఈ రక్తాన్ని పదిలంగా భద్రపరిచారట. మహేశ్ బాబుకు గౌతమ్ జన్మించిన సమయంలోనూ ఇలాగే చేశారట.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!