Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!

    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!

    June 20, 2023

    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

    చిరంజీవి ఎమోషనల్..

    ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సంతోష క్షణాలు నిజం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పొయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ‘లిటిల్ మెగా ప్రిన్సెస్‌కి సుస్వాగతం. నీ రాక‌తో లక్షలాది మంది ఉన్న మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. నీ రాక వల్ల రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులైతే, మేం గ్రాండ్ పేరెంట్స్ అయ్యాం. ఈ ఆనంద క్షణాలు సంతోషంగా గ‌ర్వంగా ఉన్నాయి’ అంటూ లిటిల్ మెగా ప్సిన్సెస్ రాక‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

    అలాగే అపోలో ఆస్పత్రి వద్ద వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఉద్దేశిస్తూ మెగాస్టార్ మాట్లాడారు. తన మనవరాలి రాకపై ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం 1.49 నిమిషాలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం.. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరూ తల్లిదండ్రులు కావాలని, మాచేతుల్లో బిడ్డను పెట్టాలని మేము కోరుకున్నాం. అతి ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల నెరవేరింది అని చెప్పుకొచ్చారు.

    11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది..

    చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహమైంది. జూన్ 14న 11వ వివాహ వార్షికోత్సవం సైతం జరుపుకున్నారు. వారం రోజులు తిరగక ముందే మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరిసింది.  రామ్‌చరణ్- ఉపాసనలు తాము పేరెంట్స్ అవుతున్నామనే విషయాన్ని ఎప్పడెప్పుడూ చెబుతారా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు.  చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఉపాసన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది. 

    డెలివరీ కోసం అంతర్జాతీయ వైద్య బృందం

    తన డెలివరీ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులను ఎంచుకుంది. డాక్టర్ సుమనా మనోహర్,  డాక్టర్ రూమా సిన్హా  అపోలో ఆస్పత్రుల్లో OB/GYN బృందంలో కీలకంగా ఉన్నారు. వీరితో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ కూడా ఉపాసన డెలివరి బృందంలో భాగంగా మారారు. వీరి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది ఉపాసన. డెలివరీ డేట్ దగ్గరపడటంతో ఆపోలో ఆస్పత్రిలో  ఈ అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలోఉపాసన ప్రసవించింది.

    ఐకాన్ స్టార్ రాక..

    రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో వారిని విష్ చేసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ‌అపోలో ఆస్పత్రి వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని దీవించారు. రామ్‌చరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు.

     అటు చరణ్‌-ఉపాసనలకు శుభాకాంక్షలు చెప్పేందుకు మెగా ఫ్యాన్స్‌ ఆస్పత్రికి పొటెత్తారు. సోషల్ మీడియాలోనూ #MegaPrincess హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version