ఏటా ఎన్నో సినిమాలు విడుదలవుతాయి. కానీ, కొన్నే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాలను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇక, కొన్ని ఫ్రెండ్స్‌తో చూసే సినిమాలుంటాయి. ఒంటరిగా చూసినప్పుడు పొందని అనుభూతి.. ఫ్రెండ్స్‌తో కలిసి చూసినప్పుడు కలుగుతుంది. దోస్తులతో కూర్చొని చూస్తున్నప్పుడు తెగ ఎంజాయ్ చేస్తాం. తెలుగులో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.
ఈ నగరానికి ఏమైంది?
తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైంది. విభిన్న ప్రవృతులు కలిగిన నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. వీరందరూ ఒక చోట కలిసి తమ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకోవడం, గోవాకి వెళ్లడం, డబ్బుల కోసం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో పాల్గొనడం వంటి ఘట్టాలతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంటుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో సినిమా అందుబాటులో ఉంది.
సొంతం
సినిమా కోసం కన్నా కామెడీ సీన్ల కోసం ‘సొంతం’ మూవీ చూసేవాళ్లు చాలామంది. ఇందులోని సన్నివేశాలు అంతలా నవ్వు పుట్టిస్తాయన్నమాట. ముఖ్యంగా, సునీల్, ఎం.ఎస్. నారాయణ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్. ఇప్పటికీ ఈ సీన్ల కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటారు నెటిజన్లు. ఒకరకంగా సినిమాకు హీరో ‘సునీల్’ అని చెప్పవచ్చు. శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
వెంకీ
ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే వెంకీ సినిమా ఫుల్ టైం ఎంటర్‌టైనర్. ఇందులోని ట్రైన్ సీన్ బెస్ట్ కామెడీ ట్రాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఎస్సై సెలక్షన్స్‌కి ఎంపికైన నలుగురు స్నేహితులు అనుకోని ప్రమాదంలో పడితే ఎలా తప్పించుకున్నారనేదే సినిమా కథ. హీరోకు లవ్ ట్రాక్ జోడించి మరింత ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. ఈ మూవీ మ్యూజికల్‌గానూ మంచి విజయం సాధించింది. డీఎస్పీ స్వరాలు సమకూర్చాడు.
హ్యాపీడేస్
ఫ్రెండ్‌షిప్‌కి కేరాఫ్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇంజినీరింగ్ చదువులు, స్నేహితుల మధ్య సంబంధాలను చక్కగా చూపించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలిరా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాలేజీ స్టూడెంట్స్ జీవితాన్ని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మ్యూజికల్‌గానూ హిట్ టాక్ తెచ్చుకుంది.
జాతిరత్నాలు
ఈ మధ్య కాలంలో వచ్చిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘జాతిరత్నాలు’. సిటీలో ఉండాలని అనుకుని ఊరి నుంచి వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది సినిమాలో చూపించాడు డైరెక్టర్ కేవీ అనుదీప్. పనీ పాట లేకుండా ఊరిలో తిరగడం, నగరానికి వచ్చి ఇబ్బందులను కోరి తెచ్చుకోవడం, వాటి నుంచి బయట పడటానికి ప్రయత్నించే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. నిజంగా మనలో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఓ వైపు ఫ్యామిలీ డ్రామాను నడిపిస్తూనే ఫ్రెండ్‌షిప్‌ని తెలియజేస్తుందీ చిత్రం. తమ జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో ఒకరికొకరు ఎలా తోడున్నారనే సీన్స్‌ని చక్కగా చూపించాడు శేఖర్. నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ, అభిజీత్, తదితరులు ఇందులో నటించారు.
వున్నది ఒకటే జిందగీ
‘మన కష్టసుఖాలను చెబితే వినేవాడు ఫ్రెండ్.. కానీ, ఆ కష్టసుఖాల్లో తోడుండే వాడే బెస్ట్ ఫ్రెండ్’ అంటూ ఫ్రెండ్‌కి, బెస్ట్ ఫ్రెండ్‌కి తేడా చెప్పిన సినిమా ఇది. రామ్ పోతినేని, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఓ ఫీల్ కలుగుతుంది. మ్యూజికల్‌గా సినిమా మంచి విజయాన్ని సాధించింది.
డీజే టిల్లు
రీసెంట్‌గా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోతో ప్రేక్షకులను అలరించాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఈ సినిమా చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇందులోని డైలాగ్స్, మ్యూజిక్ ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ఆహా, సోనీ లివ్ ప్లాట్‌ఫారంలలో స్ట్రీమింగ్ అవుతోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!