Nani HBD: నాని గురించి స్టార్‌ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్‌బంప్సే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nani HBD: నాని గురించి స్టార్‌ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్‌బంప్సే!

    Nani HBD: నాని గురించి స్టార్‌ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్‌బంప్సే!

    February 24, 2024

    స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని.. తన కృషి, పట్టుదలతో స్టార్‌ హీరోల సరసన నిలిచాడు. ఇవాళ నాని పుట్టిన రోజు (#HappyBirthdayNani) కావండంతో ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నాని అప్‌కమింగ్‌ మూవీ ‘సరిపోదా శనివారం’ (#SaripodhaaSanivaaram) విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆ సినిమా హ్యాష్‌ట్యాగ్‌తోనూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియోను షేక్‌ చేస్తున్న నాని వీడియోలపై ఓ లుక్కేద్దాం. 

    ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ నచ్చిన హీరో నాని. పలు వేదికలపై మహేష్‌, రాజమౌళి, అల్లు అర్జున్‌, రవితేజ, డైరెక్టర్‌ సుకుమార్‌ వంటి ప్రముఖులు నానిపై చేసిన ప్రశంసల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. 

    నాని సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో ముఖ్య అతిథి పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. నేచురల్ స్టార్‌ వ్యక్తిత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. నానికి భగవంతుడు గొప్ప విజయాలను ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఈ వీడియోను నాని బర్త్‌డే సందర్భంగా పవన్‌ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. 

    టాలీవుడ్‌ సంచలనాల డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా సైతం ఓ ఇంటర్యూలో హీరో నానిని కొనియాడాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అందరితో కలిసి స్టీల్‌ ప్లేట్‌ను తుడుచుకొని తిన్న నాని.. ఈ రోజు ఏ స్థాయికి ఎదిగాడో అంటూ సందీప్‌ ప్రశంచించాడు. . 

    ‘సీతారామం’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి.. నానితో ‘కృష్ణగాడి ప్రేమకథ’ చిత్రం తీశారు. ఆ సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆయన నానిపై ప్రశంసలు కురిపించారు. నాని ఒక్క క్షణం కూడా పాత్ర నుంచి బయటకు రాడని.. ఆ క్యారెక్టర్‌లోనే కూర్చుండిపోతాడని పేర్కొంటాడు. 

    నాని హీరోగా చేసిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని ఓ ఆడియో ఫంక్షన్‌లో ‌అల్లుఅర్జున్ పేర్కొంటాడు. నాని నటన చాలా బాగుందంటూ ప్రశంసిస్తాడు. ప్రస్తుతం ఆ వీడియోను సైతం నాని పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. 

    నాని బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో మరో ఆసక్తిర వీడియో వైరల్ అవుతోంది. తోటి స్టార్స్ అయిన ప్రభాస్, తారక్‌ ఇతర హీరోల గురించి నాని చేసిన హెల్తీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాని ఏమన్నాడో కింద వీడియోలో మీరే చూడండి. 

    ఈ జనరేషన్‌ యువతలో ప్రేరణ కలిగిస్తూ నాని చేసిన ఓ వీడియో సైతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమ కలలను నేరవేర్చుకునే క్రమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా బలంగా నిలబడాలని నాని ఈ వీడియో సూచించాడు. 

    మరోవైపు నాని స్ఫూర్తిదాయక వీడియోలు సైతం #HappyBirthdayNani హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌ ప్రారంభంలో తాను పడ్డ ఇబ్బందులను నాని స్వయంగా పలు వేదికలపై చెప్పుకొస్తాడు. వాటన్నింటిని జోడిస్తూ ఫ్యాన్స్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. 

    ఒక అమీతాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి ఆ తర్వాత నాని.. అంటూ సాగే వీడియో కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సౌత్‌ ఇండియాలో నాని ఓ అద్భుతమైన నటుడు అంటూ రవితేజ ఈ వీడియో ప్రశంసిస్తాడు.

    నాని కెరీర్‌లో ఇప్పటివరకూ జరిగిన మెమోరబుల్‌ మూమెంట్స్‌, హైలెట్‌ మూవీ సీన్లను ఒక చోట చేర్చి చేసిన మరో వీడియో కూడా ఆకట్టుకుంటోంది. 

    ఇక నాని బర్త్‌డే సందర్భంగా.. తన అప్‌కమింగ్‌ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి ఆసక్తికర పోస్టు విడుదలైంది. చుట్టూ మంటలు.. ముఖాన ముసుగుతో నాని చాలా అగ్రెసివ్‌గా పోస్టర్‌లో కనిపించాడు. అయితే ఈ చిత్రం ఆగస్టు 14 లేదా ఆగస్టు 28 తేదీల్లో రిలీజయ్యే అవకాశముందని సినీ వర్గాల టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version