ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 17-23 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
హిడింబ
అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం (జులై 20) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇప్పటివరకూ చూడని ఓ కొత్త కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతామని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకుంటాయని ధీమాగా ఉంది.
అన్నపూర్ణ ఫొటో స్టూడియో
చైతన్య రావ్, లావణ్య జంటగా చేసిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). ఈ చిత్రాన్ని చెందు ముద్దు డైరెక్ట్ చేశారు. యష్ రంగినేని నిర్మించారు. ‘ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు. కథ 90వ దశకంలో సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. కాగా, జులై 21న ఈ సినిమా విడుదల కానుంది.
హత్య
‘బిచ్చగాడు-2’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని హత్య మూవీతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బాలాజీ కుమార్ తెరకెక్కించారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు.
ఒప్పెన్ హైమర్
ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఒప్పెన్ హైమర్’. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్ ఒప్పెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించనున్నారు. వీఎఫ్‌ఎక్స్ షాట్స్ లేకుండా ఈ సినిమాను రూపొందించడం విశేషం. జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది.
హర్
రుహానీ శర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్ స్వరాఘవ్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘హెచ్.ఇ.ఆర్.’ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు. ఆసక్తికర, కథా, కథనాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది.
అలా ఇలా ఎలా
ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అలా ఇలా ఎలా’. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది.
ఇతర సినిమాలు
పైన చెప్పిన సినిమాలతో పాటు ఈ వారం నాగద్వీపం, కార్తీక, జిలేబి, నాతో నేను వంటి చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర నిర్మాతాలు భావిస్తున్నారు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
Title | Category | Language | Platform | Release Date |
The deepest breath | Movie | English | Netflix | July 19 |
Sweet magnolias | Web Series | English | Netflix | July 20 |
The cloned tyrone | Movie | English | Netflix | July 21 |
Bawaal | Movie | Hindi | Amazon Prime | July 21 |
Estate | Movie | Tamil | Zee5 | July 18 |
Spider-Man: Across the Spider-Verse | Movie | English | Zee5 | July 18 |
Trial period | Movie | Hindi | JioCinema | July 21 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!