Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?

    Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?

    February 17, 2024

    ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీ పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడి స్టార్‌ హీరోల చిత్రాలన్ని దాదాపుగా జాతీయ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ (OG), జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’ (Devara) చిత్రాలు కూడా ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘ఓజీ’లో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan) నటిస్తుండగా.. ‘సాహో’ (Sahoo) ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దేవర (Devara) చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలు విడుదల కాగా.. అవి క్లాష్‌ అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

    క్లాష్‌ ఎలా వచ్చిందంటే?

    పాన్ ఇండియా (Pawan vs Jr NTR) లెవెల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘దేవర’, ‘ఓజీ’ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. తాజాగా రెండు సినిమాల మేకర్స్‌ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం పవన్‌ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్‌ 27న వస్తుండగా.. తారక్‌ దేవర మూవీ అక్టోబర్‌ 10న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు (OG vs Devara) దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ స్టార్‌ హీరోలు బరిలో నిలుస్తుండటంతో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. 

    గతంలోనూ ఇలాగే!

    గతంలోనూ పవన్‌ కల్యాణ్‌, తారక్‌ (OG vs Devara) చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. 2013లో పవన్‌ నటించిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) చిత్రం కూడా సరిగ్గా సెప్టెంబర్‌ 27న విడుదలైంది. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఒరిజినల్‌ ప్రింట్‌ బయటకు వచ్చినప్పటికీ పవన్‌ మేనియాతో ఆ సినిమా సాలిడ్ హిట్‌ అందుకుంది. అయితే కొద్ది రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ ‘రామయ్య వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) చిత్రం రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్‌ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే సాహో ఫ్లాప్‌తో సుజీత్‌.. ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల శివ ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. 

    2 వారాలు సరిపోతాయా?

    పవన్‌ సినిమా ‘దేవర’కు మధ్య (Pawan vs Jr NTR) రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ముందుగా ‘ఓజీ’ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో సమస్య ఉండకపోవచ్చు. కానీ రెండు వారాల గ్యాప్‌లోనే ‘దేవర’ వస్తుండటంతో ఓజీ థియేటర్లను ఆ సినిమా ఆక్రమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది క్రిస్మస్‌ కానుకగా వచ్చిన సలార్‌ (Salaar)కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండు వారాల తర్వాత సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో సలార్‌ భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోయింది. దీంతో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ప్రభాస్‌ చిత్రం రూ.700 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురువుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. 

    ‘ఒకేసారి రిలీజ్‌ చేయండి’

    దేవర, ఓజీ సినిమాల క్లాష్‌ అంశం (Pawan vs Jr NTR) సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్‌ చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా విజయం సాధిస్తుందని పవన్‌, తారక్ ఫ్యాన్స్ ఇరువురు చాలా దీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డులను అవి బద్దలు కొడతాయని అంటున్నారు. మరికొందరు న్యూట్రాల్‌ ఫ్యాన్స్ రెండు వారాల గ్యాప్ ఉండటమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అది ఇండస్ట్రీకి మేలు చేస్తుందని చెబుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version