‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం కోసం బన్నీ (Allu Arjun) ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ లోకం ఎదురుచూస్తోంది. ‘పుష్ప: ది రూల్’ పేరుతో వస్తోన్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సి ఉంది. ఓవర్సీస్‌లో లాంగ్ వీకెండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక రోజు ముందే దీన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం తాజాగా మరో ఫీట్ సాధించింది. భారతీయ సినీ చరిత్రలో ఏ సినిమాకు సాధ్యంకాని అల్‌టైమ్ రికార్డు (Pushpa 2 Record)ను సొంతం చేసుకుంది.
‘పుష్ప 2’ అరుదైన ఘనత
పుష్పకి ముందు వరకూ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిచయమైన అల్లుఅర్జున్ ఆ సినిమా సక్సెస్‌తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా స్థాయితో పాటు ఓవర్సీస్‌లోనూ పుష్ప’ (2021) సక్సెస్ కావడంతో ‘పుష్ప 2’పై విదేశీ ఆడియన్స్‌లోనూ భారీగా హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్‌లో ప్రీసేల్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. దీంతో ‘పుష్ప 2’ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా ప్రీసేల్ టికెట్స్ కోసం ఎగబడ్డారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా తొలి 15 వేల టికెట్స్ (Pushpa 2 Record) అమ్ముడుపోయాయి. అమెరికాలో భారతీయ చిత్రానికి ఇంతవేగంగా టికెట్స్ అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీమ్ స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోతోంది. విడుదలకు ముందే ఈ స్థాయిలో రికార్డులు గల్లంతైతే రిలీజ్ తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
రాజమౌళి తరహాలో ప్రమోషన్స్!
‘బాహుబలి-2‘, ‘RRR‘ సినిమాలకు రాజమౌళి టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ‘ చిత్రానికి సైతం బుజ్జి వెహికల్‌తో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోట్ చేయించారు. ఇప్పుడు అదే ఫార్మూలాను పుష్ప టీమ్ (Pushpa 2 Record) కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్ కోసం నెల రోజుల సమయాన్ని కూడా కేటాయించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో ‘పుష్ప 2’ ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారట. బిహార్ రాజధాని పాట్నాలో సైతం ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించాలని యోచిస్తున్నారట. బాలీవుడ్‌లోనూ ప్రమోషన్స్ చేసి నార్త్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసే యోచనలో పుష్ప టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంకా రెండు పాటలు పెండింగ్!
పుష్ప 2 (Pushpa 2 Record) రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ మూవీ షూటింగ్ ఇంకా పూర్తికాలేదని సమాచారం. ఇంకా రెండు పాటలు, ఓ సీన్ చిత్రీకరించాల్సి ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ఎంతో కీలకమైన ఐటెం సాంగ్ కూడా ఉంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపించగా చివరకూ శ్రీలీలను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇవాళ్టి నుంచే ఈ సాంగ్ షూట్ మెుదలైనట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ ఉంది. మరి ఈ షార్ట్ టైమ్‌లో ఐటెం సాంగ్‌తో పాటు మరో పాట, పెండింగ్ సీన్‌ను సుకుమార్ ఎలా ఫినిష్ చేస్తారన్నది ఆసక్తికరం. ఇదిలా ఉంటే డబ్బింగ్ పనులు అన్ని భాషల్లో ఏకకాలంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. బన్నీ కూడా తన పాత్రకు సంబంధించి ఫస్టాఫ్ డబ్బింగ్‌ను పూర్తిచేశాడట. మిగిలినది కూడా త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడట.
నవంబర్ 15న ట్రైలర్ లాంచ్!
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పుష్ప ట్రైలర్ (Pushpa 2 Record) అప్పట్లో ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో ట్రైలర్ కట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే ట్రైలర్‌ను తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 15న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేయోచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి