చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్.. తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో నటనకు పెద్ద స్కోప్ లేని పాత్రలు చేసిన చరణ్.. ‘రంగస్థలం’ సినిమాతో తనలోని అసలైన నటుడ్ని పరిచయం చేశాడు. ‘ఆర్‌ఆర్ఆర్‘ ద్వారా నటనలో మరో స్టెప్ పైకెక్కి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ జాతీయ స్థాయిలో బజ్ ఉంది. అటు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, సుకుమార్‌తోనూ సినిమాను అనౌన్స్ చేశాడు. లేటెస్ట్‌గా తమిళ స్టార్ డైరెక్టర్‌తో మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
డైరెక్టన్ ఎవరంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran)తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్‌తో వెట్రిమారన్ సినిమా ఉంటుందని విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ, అది వర్కౌట్ కాలేదు. రీసెంట్‌గా చరణ్‌కు తమిళ డైరెక్టర్ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అది చరణ్‌కు బాగా నచ్చిందని సమాచారం. కథలో స్వల్ప మార్పులు చేయాలని చరణ్ సూచించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఆ ఛేంజస్ తర్వాత త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎవరీ వెట్రిమారన్?
తమిళంలో వెట్రిమారన్ చిత్రాలకు (Vetrimaaran Movies) చాలా గుర్తింపు ఉంది. ఆయన హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన సినిమాల్లో కథే ప్రధాన హీరో. వెట్రిమారన్ తీసిన ‘డుకాలం’, ‘విసారణై’, ‘వడాచైన్నై’, ‘అసురన్’, ‘విడుతలై’ వంటి సినిమాలు గమనిస్తే అందులో కథే కీలక పాత్ర పోషించింది. అందులో నటీనటుల కంటే పాత్రలే ఆడియన్స్ కనిపించాయి. వెట్రిమారన్ ఇప్పటివరకూ 8 చిత్రాలకు దర్శకత్వం వహించగా అందులో మూడు నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్నాయి. అటువంటి డైరెక్టర్‌తో రామ్‌చరణ్ ప్రాజెక్ట్ ఓకే అయితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. నటుడిగా రామ్‌చరణ్ మరో మెట్టు ఎక్కుతాడనడంలో ఎలాంటి సందేహాం ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు.
రెండేళ్లు ఆగాల్సిందే!
ప్రస్తుతం రామ్ చరణ్.. తమిళ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ‘బుచ్చి బాబు’ దర్శతక్వంలో చరణ్ చేయనున్నాడు. మరోవైపు సుకుమార్‌తోనూ ఓ సినిమా చేసేందుకు చరణ్ కమిట్‌మెంట్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాతనే ఆయన వెట్రిమారన్‌తో సినిమా చేసే అవకాశముంది. ఇందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టొచ్చు. అటు వెట్రిమారన్ కూడా ప్రస్తుతం ‘విడుదతలై పార్ 2’కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే గరుడాన్ అనే ఫిల్మ్‌కు కూడా వెట్రిమారన్ కథ అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాతనే రామ్‌చరణ్ మూవీపై ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు.
బిగ్ అప్‌డేట్స్ ఎక్కడా!
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఒక్క సాంగ్ తప్ప ఎలాంటి బిగ్ అప్‌డేట్స్ రాలేదు. సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్నా లీక్స్ తప్ప సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాలేదు. అయితే ఈ సంవత్సరం ఎలాగైన సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ప్రముఖ నటి అంజలి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్