రెడ్మీ తన అత్యంత ప్రతిష్టాత్మక Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 26న లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో Redmi Note 14, Redmi Note 14 Pro Plus మోడల్‌లు కూడా విడుదల కానున్నాయి. లాంచ్ ఈవెంట్ తర్వాత ఇవి తొలుత చైనాలో సేల్స్‌కు రానున్నాయి. కొద్దిరోజుల తర్వాత ఈ ఫోన్‌లు భారతదేశంలో కూడా విడుదల కానున్నాయి.
భారతదేశంలో ఈ రెడ్మీ సిరీస్ ఫోన్లపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. లాంచ్‌కు ముందే Redmi Note 14 Pro ఫీచర్లకు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Redmi Note 14 Pro స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 1220 x 2712 పిక్సెల్‌ల రిజల్యూషన్, 1.5K రిజల్యూషన్, 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, Redmi Note 14 Pro స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది.
ఫోన్ HyperOS ఆధారిత ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతుంది. అదనంగా, ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లు 4 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటాయి.
వేరియంట్లు -స్టోరేజ్
Redmi Note 14 Pro మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది – 8GB RAM + 128GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ మరియు 16GB RAM + 512GB స్టోరేజ్. స్టోరేజ్ విస్తరణ కోసం మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.
కెమెరా ఫీచర్లు
ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్‌లో సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 16MP కెమెరా ఉంది. అలాగే, ఈ గ్యాడ్జెట్‌లో LED ఫ్లాష్, ఇతర ఆకర్షనీయమైన కెమెరా ఫీచర్లు ఉంటాయి.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్
Redmi Note 14 Pro 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌కు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి వినియోగదారులు త్వరగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ
- మొబైల్ నెట్‌వర్క్: 5G, 4G VOLTE
- వైఫై: డ్యూయల్ బ్యాండ్ (2.4GHz మరియు 5GHz)
- GPS: డ్యూయల్ బాండ్ GPS
- బ్లూటూత్: 5.3
- USB: Type-C 2.0
కలర్స్
రెడ్‌మీ ఈ ఫోన్‌ను నాలుగు రంగుల్లో అందిస్తుంది – మిడ్‌నైట్ బ్లాక్, మిర్రర్ పోర్సిలైన్ వైట్, ట్విలైట్ పర్పుల్, ఫాంటమ్ బ్లూ.
ధర
ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇండియాలో రూ. 20,000 లోపు ఉండే అవకాశముందని ఊహిస్తున్నారు.