Sabari Movie Review: థియేటర్లలోకి వచ్చేసిన వరలక్ష్మీ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రం.. ‘శబరి’ హిట్టా? ఫట్టా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sabari Movie Review: థియేటర్లలోకి వచ్చేసిన వరలక్ష్మీ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రం.. ‘శబరి’ హిట్టా? ఫట్టా?

    Sabari Movie Review: థియేటర్లలోకి వచ్చేసిన వరలక్ష్మీ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రం.. ‘శబరి’ హిట్టా? ఫట్టా?

    May 3, 2024

    నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్‌, గణేశ్‌ వెంకట్రామన్‌, శశాంక్‌, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక, రాజశ్రీ నాయర్‌ తదితరులు

    దర్శకత్వం: అనిల్‌ కాట్జ్‌ 

    సంగీతం: గోపి సుందర్‌

    ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకర్ల

    సినిమాటోగ్రఫీ: రాహుల్‌ వాత్సవ, నాని చమిడిశెట్టి

    నిర్మాత: మహేంద్రనాథ్‌ కూండ్ల

    విడుదల: 03-05-2024

    వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. గణేశ్‌ వెంకట్రామన్‌, శశాంక్‌, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం. 

    కథేంటి

    సంజనా (వరలక్ష్మి శరత్‌ కుమార్‌), అరవింద్‌(గణేష్‌ వెంకట్‌ రామన్‌) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత సంజనా.. ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి వైజాగ్‌ వచ్చేస్తుంది. తన ఫ్రెండ్‌ సాయంతో ఓ కార్పొరేట్‌ కంపెనీలో జుంబా డ్యాన్స్‌ ట్రైనర్‌గా చేరుతుంది. మరోవైపు సంజనాను చంపేందుకు సూర్య (మైమ్ గోపి) ప్రయత్నిస్తాడు. పోలీసులు దర్యాప్తు చేయగా అతడు చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనాను వెంబడిస్తున్న సూర్య ఎవరు? అరవింద్‌తో సంజన ఎందుకు విడిపోయింది? కిడ్నాప్‌కు గురైన కూతుర్ని సంజన ఎలా కాపాడుకుంది? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    సంజనా పాత్రకు వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. 100 శాతం న్యాయం చేసింది. ఇనాళ్లు విలనిజం ఉన్న పాత్రలు పోషించిన ఆమె.. ఇందులో డిఫరెంట్‌ రోల్‌ ప్లే చేసింది. కూతురుని కాపాడటం కోసం పోరాడే సాధారణ మహిళ పాత్రలో మెప్పించింది. అటు మైమ్‌ గోపి విలనిజం బాగా వర్కౌట్‌ అయింది. రియాగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష అద్భుతంగా నటించింది. అరవింద్‌గా గణేష్ వెంకట్రామన్ చక్కగా చేశాడు. లాయర్‌గా శశాంక్‌, పోలీసు అధికారి శంకర్‌గా మధుసూధన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే పోరాటాన్ని చక్కగా ఆవిష్కరించాడు. సంజన ఉద్యోగం కోసం వెతకడం.. ఈ క్రమంలో ఆమె బాల్యం.. అరవింద్‌తో పెళ్లి.. విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎమోషనల్‌గా కథనాన్ని నడిపించాడు. అయితే ప్రతీది డీటైల్డ్‌గా చూపించడంతో ఫస్టాఫ్‌ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్‌ రివీల్‌ అవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. క్లైమాక్స్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఈ మూవీ కథ బాగున్నా దానిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. కథంతా ఒక్క పాయింట్‌ చుట్టే తిప్పడం వల్ల ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. స్క్రీన్‌ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండే ఫలితం మరింత బెటర్‌గా వచ్చేది. 

    టెక్నికల్‌గా

    సాంకేతికంగా సినిమా పర్వాలేదు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం గుర్తుంచునేలా లేవు. సినిమాటోగ్రఫీకి మంచి మార్కులే ఇవ్వొచ్చు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి తక్కువే అయినా చాలా చోట్ల అనవసరపు సీన్స్‌ ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. 

    ప్లస్ పాయింట్స్

    • వరలక్ష్మీ నటన
    • కథలోని ట్విస్టులు
    • నేపథ్య సంగీతం

    మైనస్ పాయింట్స్‌

    • స్క్రీన్‌ప్లే 
    • స్లో నారేషన్‌

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version