• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జైలర్’ రికార్డును బ్రేక్ చేసిన ‘లియో’

    విజయ్ హీరోగా నటించిన లియో చిత్రం బాక్సాఫీస్ దూసుకు పోతుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లను సాధిస్తోంది. తాజాగా ఈ చిత్రం జైలర్ రికార్డును బ్రెక్ చేసింది. న్యూజిలాండ్‌లో లియో మూవీ 2,01,148 డాలర్లను వసూలు చేసింది. 3 లక్షల డాలర్లతో రోబో 2.0 టాప్‌లో ఉంది. లియో చిత్రం న్యూజిలాండ్‌లో మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లియో చిత్రంలో త్రిష కీలక పాత్ర పోషించారు.

    ‘లియో’ తెలుగు వెర్షన్‌ విడుదలపై క్లారిటీ

    ‘లియో’ చిత్రం తెలుగు వెర్షన్‌ విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 19న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, తెలుగు వెర్షన్‌ అదే రోజు విదుదలవుతుందని చెప్పారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. ‘లియో’ సినిమాలో హీరోయిన్ గా త్రిష, నటులు సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    విడుదలకు ముందే ‘లియో’ రికార్డులు

    విజయ్ హీరోగా నటించిన ‘లియో’చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు విడుదల దగ్గరపడుతుండడంతో రికార్డులను బ్రేక్ ,చేస్తోంది. ఓవర్సీస్‌లో లియో టికెట్ల సేల్స్ మిలియన్‌ మార్క్‌ను అవలీలగా చేరుకుంది. ఈ సినిమా విడుదల రెండు రోజుల ముందే ఓవర్సీస్‌లో దీని టికెట్లు వన్‌ మిలియన్‌ డాలర్లకు పైగా అమ్ముడయ్యాయి. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డును తాజాగా లియో అధిగమించింది. అక్కడ మొదటిరోజు 15000 టికెట్లు అమ్ముడయ్యాయి.

    థియేటర్లకు సెన్సార్ బోర్డు నోటీసులు

    విజయ్ దళపతి హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.. ఈ ట్రైలర్‌ను చెన్నైలోని కొన్ని థియోటర్లలో ప్రదర్శించారు. అయితే దాన్ని ప్రదర్శించిన థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. సెన్సార్ కట్ లేకుండా థియేటర్లలో చూపించారని పేర్కొంది. అభ్యంతర పదాలతో కూడిన ట్రైలర్ చూపించారంటూ సెన్సార్ బోర్టు సదరు థియేటర్ల యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

    షారుక్ రికార్డును బ్రేక్ చేసిన ‘లియో’

    విడుదలకు ముందే హీరో విజయ్ నిటించిన ‘లియో’ చిత్రం సరికొత్త ట్రెండ్‌ను క్రియోట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ఈ టికెట్స్ మొదటి రోజు సేల్స్ షారుక్ సినిమాలను అధిగమించింది. ‘లియో’ చిత్రానికి నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. యూకేలో వీటిని రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. ‘లియో’ మొదటి రోజు టికెట్స్ బుకింగ్స్ షారుక్ నటించిన పఠాన్, జవాన్ సినిమాల కంటే అధికంగా అమ్ముడయ్యాయి. లియో ఫస్ట్‌డే షో కోసం 30వేల మంది టికెట్స్ బుక్ చేసుకున్నారని … Read more

    టాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన విజయ్‌!

    తమిళ నటుడు విజయ్‌ టాలీవుడ్‌పై ఫోకస్‌పై పెట్టారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన ‘వారసుడు’ మూవీ మంచి కలెక్షన్స్‌ రాబట్టడంతో విజయ్‌ దృష్టి తెలుగు దర్శకులపై పడింది. ఈ క్రమంలో వంశీ పైడిపల్లితోనే మరో సినిమా చేయడానికి విజయ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మరో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు చెప్పిన కథలు కూడా విజయ్ విన్నాడని తెలుస్తోంది. వాటిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. విజయ్‌ చేపట్టిన ఆపరేషన్‌ టాలీవుడ్‌ ఏమేర సక్సెస్‌ అవుతుందో చూడాలి.

    ‘లియో’గా వస్తోన్న తలపతి విజయ్

    తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ‘లియో’గా వస్తున్నాడు. సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘లియో; బ్లడీ స్వీట్’గా వస్తోంది. ఈ మేరకు సినిమా యూనిట్ టైటిల్‌ను రివీల్ చేసింది. ఈ టైటిల్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ జమ్ము కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

    విజయ్‌ చిత్రానికి సరికొత్త టైటిల్‌

    దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం టైటిల్ ఖరారయ్యింది. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో మాస్టర్‌ తర్వాత విజయ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రానికి దర్శకుడు ఎవ్వరూ ఊహించని టైటిల్‌ పెట్టాడు. సినిమాకు లియో: బ్లడీ స్వీట్‌ అనే పేరు ప్రకటించారు. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి అక్టోబర్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త టైటిల్ ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేసిన చిత్రబృందం వీడియో కూడా విడుదల చేసింది.

    తెలుగులోనూ ‘రంజితమే’

    తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ’వారిసు’ చిత్రంలో ‘రంజితమే’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 25 రోజుల్లోనే 7 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేస్తున్నారు. రంజితమే సాంగ్‌ను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. వంశీ పైడిపల్లి ఈ మూవీని తెరకెక్కించారు. జనవరి 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.