• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఘోర పడవ ప్రమాదం; 145 మంది దుర్మరణం

  కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునిగిపోవడంతో అందులో ఉన్న 145 మంది జలసమాధి అయ్యారు. లులోంగా నదిలో మొత్తం 200 మందితో ఒక మోటరైజ్డ్ పడవ కాంగో వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 145 మంది మృతి చెందగా, 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులతో పాటు పశువులు, వస్తువులు కూడా ఉండటంతో ఓవర్ లోడ్ అయ్యి పడవ మునిగింది. వీరు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుండగా మృత్యువాతపడ్డారు.

  బాబ్ మార్లే మనవడు హఠాన్మరణం

  ప్రముఖ రెగ్గె గాయకుడు దివంగత బాబ్ మార్లే మనవడు జొ మెర్సా మార్లే (31) అమెరికాలో హఠాన్మరణం చెందాడు. ఆయన ఆస్తమాతో మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. జో మెర్సా కూడా రెగ్గె సింగర్. తన తాత వారసత్వంతో ఆయన కూడా రెగ్గే గీతాలు ఆలపిస్తారు. కాగా బాబ్ మార్లే 1970వ దశకంలో ఒక వెలుగు వెలిగాడు. తన రెగ్గే పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. 1981లో కేవలం 36 ఏళ్ల వయసులోనే బాబ్ మార్లే కన్నుమూశారు.

  నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

  సీనియర్ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఖుష్బూ సోదరుడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముంబైకి చెందిన ఖుష్బూకు అబ్దుల్లా, అబూబకర్, అలీ ముగ్గురు సోదరులు ఉన్నారు. తాజాగా వారిలో అబ్దుల్లా మరణించారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న అబ్దుల్లా ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఈయన కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. సెలబ్రిటీలు, అభిమానులు ఖుష్బూకు ధైర్యం చెబుతున్నారు.

  ‘అవతార్ 2’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

  ‘అవతార్ 2’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది. లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి ‘అవతార్ 2’ సినిమా చూస్తూ గుండెపోటుకు గురై అక్కడే కూలిపోయాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా గతంలోనూ ‘అవతార్ 1’ సినిమా చూస్తూ తైవాన్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. హైబీపీతో తీవ్ర ఉద్రేకానికి గురై అతడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తేల్చారు.

  ఏపీ ఎమ్మెల్సీ ‘చల్లా’ హఠాన్మరణం

  ఏపీ ఎమ్మెల్సీ చల్లా భగీరధరెడ్డి (46) కన్నుమూశారు. న్యూమోనియాతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూ బుధవారం మరణించారు. గురువారం ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా అవుకులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా భగీరధరెడ్డి 2003 నుంచి 2019 వరకు కాంగ్రెస్‌లో, అప్పటినుంచి వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

  అజారుద్దీన్ ఇంట తీవ్ర విషాదం

  హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజారుద్దీన్ తండ్రి మహ్మద్ యూసఫ్ అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లో మరణించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని మసీద్ ఈ బాకీ జోహార్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అంతకుముందు నమాజ్ ఈ జనాజా నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

  అంతకంతకూ పెరుగుతూ పోతున్న అమర్‌నాథ్ మృతుల సంఖ్య

  అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ తీవ్ర వరదలు రావడంతో.. యాత్రికులంతా చెల్లాచెదురయ్యారు. ఈ విషాదంలో ఎంతో మంది భక్తులు మరణించారు. అంతే కాకుండా అనేక మంది వరదల్లో కొట్టుకుపోయారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంది. అమర్‌నాథ్ వరదలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  క్యాన్స‌ర్‌తో యువ‌హీరో మృతి

  అస్సామి న‌టుడు కిశోర్ దాస్ క్యాన్స‌ర్‌తో చికిత్స తీసుకుంటూ మ‌ర‌ణించాడు. ఇంత చిన్న వ‌య‌సులోనే యువ హీరో మ‌ర‌ణించ‌డం ఇండ‌స్ట్రీని విషాదంలో ముంచెత్తింది. టీవీ సీరియ‌ల్స్ ద్వారా ఫేమ‌స్ అయిన కిశోర్ దాస్ 300కు పైగా మ్యూజిక్ అల్బ‌బ్స్‌లో న‌టించాడు. ఇటీవ‌లే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంత‌లోపే అత‌డికి క్యాన్స‌ర్ ఉంద‌ని తెలిసింది. చెన్నైలోని ప్ర‌ముఖ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న కిశోర్ దాస్‌కు క‌రోనా సోకడంతో మ‌ర‌ణించాడు. కొంత‌కాలం క్రిత‌మే తాను చికిత్స తీసుకుంటున్నాన‌ని త్వ‌ర‌లోనే తిరిగి వ‌స్తాన‌ని సోష‌ల్‌మీడియాలో … Read more

  అసోంలో వరదలకు మరో 8 మంది దుర్మరణం

  వరదలు అసోంను వదలడం లేదు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జనాలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా పోతుంది. తాజాగా వరదల వల్ల మరో 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వరదల వల్ల 134 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గత మూడు రోజుల కిందటితో పోలిస్తే అసోంలో ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉందని వారు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన ఈ వరదలకు దాదాపు 75 లక్షల హెక్టార్లలో పంట నష్టం సంభవించింది.

  భారీ భూకంపం.. 130 మంది మృతి

  తాలిబన్ల పాలనతో విసిగిపోయిన అఫ్ఘన్లకు ప్రకృతి పెద్ద షాకిచ్చింది. అక్కడ ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల 130 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.