• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టర్కీ భూకంపం; 600కు చేరువగా మృతులు

    టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంప ధాటికి 570 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. 1,000 మందికి పైగా క్షతగాత్రులు అయినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు [పేకమేడ](url)ల్లా కుప్పకూలాయి. సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. #Turkey #earthquake #Syria #Iraq #Turkey #Iran#earthquake #Turkey Prayers for Turkey … Read more

    టర్కీ భూకంపం; 300 మంది మృత్యువాత

    టర్కీ, సిరియా దేశాలను భారీ [భూకంపం](url) కుదిపేసింది. భూకంప తీవ్రతకు ఇరు దేశాల్లో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 300 మంది మరణించినట్లు తెలుస్తోంది. సుమారు 1,000 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మలట్యా, ఉర్ఫా, దియర్‌బకీర్, అలెప్పో, హమా, లటాకియా ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా టర్కీలో భూకంపాలు సర్వసాధారణమే. ఏడాదికి కనీసం రెండు, మూడు సార్లు భూకంపాలు వస్తుంటాయి. Turkey? #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani … Read more

    నేపాల్‌లో తీవ్ర భూకంపం

    పొరుగుదేశం నేపాల్‌లో తీవ్ర [భూకంపం](url) సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైంది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా ఈ భూకంపం ప్రభావం కనిపించింది. ఉత్తరాఖండ్‌లోని పితోరగఢ్‌కు 148 కి.మీ దూరంలో నేపాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రతకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. #earthquake of 5.8 strikes #Nepal. Tremors felt across … Read more

    దిల్లీలో భూకంపం, జనాల పరుగులు

    దిల్లీలో [భూకంపం](url) సంభవించింది. వివిధ ప్రాంతాల్లో భూమి భారీగా కంపించింది. దీంతో జనాలు బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని ఫితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయ్యింది. దిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమెదైనట్లు నెషనల్‌ సెంటర్‌ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. #earthquake captured in camera.#delhi pic.twitter.com/wW3ikxFZCc — Knowledge ABC (@AbcKnowledge) … Read more

    మృత్యుంజయుడు..2 రోజులు శిథిలాలకిందే

    ఇండోనేషియాలో భూకంప తీవ్రతకు 271 మంది మరణించగా.. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఓ ఆరేళ్ల [బాలుడు ](url)రెండు రోజులుగా శిథిలాల కిందే ఉండిపోయాడు. భూకంపం ధాటికి తన ఇళ్లు కూలిపోవడంతో ఆ శిధిలాల కిందే చిక్కుకుని ఆహారం, నీరు లేకుండా ఉన్నాడు. చివరకు రెండు రోజుల తర్వాత ఆ బాలుడిని రెస్క్యూ టీం రక్షించింది. విచిత్రమేంటంటే ఆ బాలుడి తల్లి, అమ్మమ్మ ఇద్దరూ శిథిలాల కిందే మృతి చెందారు. వారి మృతదేహాల పక్కనే ఆ బాలుడు రెండు రోజులు గడిపాడు. Six-year-old … Read more

    తైవాన్‌లో భూకంపం

    తైవాన్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు కోస్తా తీరం తైతాంగ్‌కు 50 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైంది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ ప్రకంపనలు దేశమంతటా సంభవించాయి. భవనాలు స్వల్పంగా కదిలాయి. రాత్రి పూట భూమి కంపించడంతో తైవాన్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. Taiwan earthquake ?? pic.twitter.com/0lrjx6fQUM — August.. (@bornLeo17) September 17, 2022