• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అర్జెంటీనా గెలుపు.. ఫ్రీగా 1,500 బిర్యానీలు

  ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచిన సందర్భంగా ఓ వ్యక్తి 1,500 బిర్యానీలు ఉచితంగా పంచాడు. కేరళలోని త్రిశూర్ జిల్లాలోని పల్లిమూలకు చెందిన శిబు హోటల్ నిర్వహిస్తున్నాడు. అర్జెంటీనా అభిమాని అయిన ఆయన ఆ జట్టు గెలవగానే 1,500 చికెన్ బిర్యానీలు ఉచితంగా పంచాడు. దీంతో ఆయన హోటల్‌కు జనాలు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఉచితంగా బిర్యానీలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని శిబు ప్రకటించాడు.

  చర్చనీయాంశమైన మహ్మద్ షమి ట్వీట్

  ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతగా అర్జెంటినా నిలవడంపై సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత పేసర్ మహ్మద్ షమి చేసిన ఓ పోస్టు చర్చనీయాంశమైంది. అర్జెంటినా కొట్టిన రెండు గోల్స్ వీడియో షేర్ చేస్తూ వావ్ అని కామెంట్ చేశాడు. అయితే, వివాదాస్పదమైన బేషరమ్ ర్యాంగ్ పాటను ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జత చేయడంతో చర్చ ఊపందుకుంది. కొంతమంది వెక్కిరింతగా సూపర్‌ అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొంత మంది పాటకు, గోల్స్‌కి సంబంధమే లేదని ట్వీట్స్ చేస్తున్నారు. బేషరం … Read more

  దీపిక డ్రెస్సు ఇలా ఉందేంటి?

  ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించి.. భారత కీర్తిని మరింత పెంచిన నటి దీపిక పదుకొనె. అయితే, ఆవిష్కరణ సమయంలో ఈ నటి ధరించిన వస్త్రాలపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ‘ఈ వేశమేమీ బాగాలేదు. ఏదో ఒక బ్యాగును దీపిక వేసుకున్నట్టుంది. ఇంకా వేరే వస్త్రాలే దొరకలేదా? దీపిక డ్రెస్సు ఇలా ఉందేంటి?’ అంటూ నెటిజన్లు తెగ అసంతృప్తి వ్యక్యం చేస్తున్నారు. తెల్ల చొక్కాపై బ్రౌన్ రంగున్న బ్లేజర్‌ని దీపిక వేసుకుంది. ‘ఇంత అందమైన దేహానికి మరింత సొగసైన వస్త్రధారణ ఉంటే బాగుండేది’ అంటూ … Read more

  ఆకట్టుకుంటున్న బెంగుళూరు పోలీసుల ట్వీట్

  నెట్టింట ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ గురించి చర్చించుకుంటున్న క్రమంలో బెంగుళూరు నగర పోలీసులు చేసిన ఓ పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ రౌండులో అర్జెంటినా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇందులో మెస్సీ తొలి పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఈ ఫొటోను తీసుకుని.. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వేసే పెనాల్టీతో పోల్చారు. ‘వాహనదారులకు వేసే పెనాల్టీ మాకు నచ్చుతుందని మీరు భావిస్తారు. కానీ, మాకు ఇలా మెస్సీ చేసిన పెనాల్టీ అంటేనే ఇష్టం’ అని అర్థం … Read more

  ఫిఫా దెబ్బకు గూగుల్ నయా రికార్డ్

  ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సరికొత్త రికార్డు సృష్టించింది. తన 25 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించాడు. ‘‘యావత్ ప్రపంచం ఒకే ఒక్క దాని కోసం వెతికినట్లు అనిపిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఫిఫా, మెస్సీ, అర్జెంటీనా, ఎంబాపే పేర్లు గూగుల్‌లో తెగ వెతికారు. భారతీయులు కూడా ఫిఫా ప్రపంచకప్ గురించి గూగుల్‌లో తెగ వెతికి మూడో స్థానంలో నిలిచారు.

  దద్దరిల్లిన అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్

  ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన ఆనందంలో అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులు హంగామా చేశారు. ప్లేయర్లందరూ కలసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ డైనింగ్ టేబుల్‌పై డ్యాన్స్ చేశాడు. ఒకరిపై ఒకరు షాంపేన్ జల్లుకుంటూ సందడి చేశారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ బిజీబిజీగా గడిపారు. ట్రోఫీని ముద్దాడటానికి ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

  మెస్సీ మ్యాజిక్ గోల్స్ చూశారా?

  అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కల సాకారమైంది. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఉత్కంఠ పోరులో ఇరు జట్లు 3-3 గోల్స్ చేయడంతో షూటౌట్‌కు దారి తీసింది. అర్జెంటీనా షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచింది. అర్జెంటీనా తరఫున్ మెస్సీ 2 కళ్లు చెదిరే గోల్స్ కొట్టాడు. మరో వైపు ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబాపే 3 గోల్స్‌తో పోరాడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని గోల్స్‌ను మీరూ చూసేయండి.

  అర్జెంటినాదే ప్రపంచకప్

  2022 ప్రపంచకప్ విజేతగా అర్జెంటినా నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో ఆ జట్టు 42 గోల్స్ తేడాతో నెగ్గింది. అంతకుముందు ఎక్స్‌ట్రా టైంలో అర్జెంటినా, ఫ్రాన్స్ చెరో గోల్ చేసి స్కోరును సమం చేశాయి. అర్జెంటినా తరఫున మెస్సీ రెండు గోల్స్(23-P, 108), డి మరియా(36) గోల్స్ చేసి జట్టుకు విజయానందాన్ని ఇచ్చారు. ఫ్రాన్స్ తరఫున ఎంబాపే ఒక్కడే మూడు గోల్స్ చేశాడు. 80(P), 81, 118(P) నిమిషాల్లో గోల్ చేసి ఫ్రాన్స్‌ని పోటీలో నిలిపాడు. ఫ్రాన్స్: గోల్, నో గోల్, నో గోల్, గోల్, … Read more

  సముద్రం లోపల ‘మెస్సీ’ కటౌట్

  అభిమాన సెలబ్రిటీ కటౌట్‌లను సాధారణంగా భూమిపై లేదా ఆకాశంలో కొంత ఎత్తులో ప్రదర్శిస్తుంటారు. కానీ, లక్ష్వదీప్‌కు చెందిన ఓ అభిమాని ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కటౌట్‌ని ఏకంగా సముద్ర గర్భంలో ఏర్పాటు చేశాడు. అరేబియా సముద్రంలో 100 మీటర్ల లోతులో మెస్సీ కటౌట్‌ని ఏర్పరచి ఔరా అనిపించాడు. మహ్మద్ స్వదిక్ తన స్నేహితులతో కలిసి ఈ సాహసం చేశాడు. స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలకి వెళ్లి కటౌట్‌తో పోజులిచ్చారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్వదిక్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. … Read more

  అర్జెంటినాదే ప్రపంచకప్

  2022 ప్రపంచకప్ విజేతగా అర్జెంటినా నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో ఆ జట్టు 42 గోల్స్ తేడాతో నెగ్గింది. అంతకుముందు ఎక్స్‌ట్రా టైంలో అర్జెంటినా, ఫ్రాన్స్ చెరో గోల్ చేసి స్కోరును సమం చేశాయి. అర్జెంటినా తరఫున మెస్సీ రెండు గోల్స్(23-P, 108), డి మరియా(36) గోల్స్ చేసి జట్టుకు విజయానందాన్ని ఇచ్చారు. ఫ్రాన్స్ తరఫున ఎంబాపే ఒక్కడే మూడు గోల్స్ చేశాడు. 80(P), 81, 118(P) నిమిషాల్లో గోల్ చేసి ఫ్రాన్స్‌ని పోటీలో నిలిపాడు. ఫ్రాన్స్: గోల్, నో గోల్, నో గోల్, గోల్, … Read more