• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘జవాన్’ మూవీ భారీ వసూళ్లు

  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జవాన్ మూవీ ఇప్పటికే రూ.560 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిన్న ఒక్క రోజే రూ.1.70 కోట్లు రాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో నయనతార, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించగా, సంజయ్ దత్, దీపికా పదుకొనే గెస్ట్ రోల్స్ చేశారు.

  వీడియో ఆపకపోతే ఫోన్ పగలగొడతా: నయన్

  [VIDEO:](url) సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లాలన్నా వారికి సమస్యే. అభిమానులు ఒక్కసారిగా మీదపడిపోతారు. తాజాగా నయనతార దంపతులు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. హనుమాన్ జయంతి రోజున తంజావూరు ఆలయానికి వెళ్లగా అక్కడ స్థానికులు చుట్టుముట్టారు. ఎలాగోలా పూజలు చేసుకుని బయటపడ్డారు. అనంతరం రైలు ఎక్కగా ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. నయన్‌తో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు తహతహలాడాడు. దీంతో విసుగు చెంది వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తా అంటూ అరిచింది. I'm not judging her but her attitude was bit arrogant … Read more

  మానవత్వం చూపించిన నయన్, విగ్నేష్

  [VIDEO:](url) నయనతార, విగ్నేష్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాతృత్వ కార్యక్రమాల్లో వీరెప్పుడూ ముందుంటారు. తాజా ఘటనతో ఇది మరోసారి నిరూపితమైంది. తమిళనాడులో రోడ్డు వెంబడి నివసిస్తున్న వారికి తగిన సహాయం చేసిందీ జంట. వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు అండగా నిలిచారు. స్వయంగా వర్షంలో వెళ్లి వారికి పలు వస్తువులను అందజేశారు. నయన్ దంపతుల మానవత్వానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ గతేడాది వివాహం చేసుకుని సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. Really nice of Lady Superstar #Nayanthara … Read more

  నయనతార ఇంట్లో షారూక్ సందడి

  బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ చెన్నైలో సందడి చేశాడు. అట్లీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ‘జవాన్’ మూవీ చిత్రీకరణ కోసం తమిళనాడుకు వచ్చాడు. ఈ సినిమాలో షారూక్ సరసన నయనతార నటిస్తోంది. షూటింగ్ అనంతరం షారూక్ నయన్ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో తిరుగు పయనమవుతుండగా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఎట్టకేలకు షారూక్ తన కారు వద్దకు చేరుకుని నయన్‌కు పెక్(చెంపపై ముద్దు) ఇచ్చాడు. నయనతార కూడా సెండ్ ఆఫ్ ఇస్తూ గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ [వీడియో](url)లు వైరల్ అవుతున్నాయి. [?]: … Read more

  మంచి మనసు చాటుకున్న స్టార్ దంపతులు

  నూతన సంవత్సరం సందర్భంగా నయనతార, విఘ్నేష్ దంపతులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వీధి వెంబడి నివసించే చిన్నారులకు బహుమతులు పంచిపెట్టి మంచి మనసును చాటుకున్నారు. దీంతో ఈ దంపతులు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్ మీడియాల్లో నెటిజన్లు వీరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గొప్ప పని చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. గతేడాది వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ప్రక్రియ ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవల విడుదలైన నయన్ ‘కనెక్ట్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Nayanthara vignesh shivan distributes gifts … Read more

  కొంతమంది వల్ల ఇబ్బంది పడ్డా; నయనతార

  లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం తను నటించిన ‘కనెక్ట్’ చిత్ర ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. కొంతమంది తన వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడాలనుకోవడంతోనే ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని చెప్పారు. అలాంటివి తనను ఇబ్బంది పెడతాయని తెలిపింది. ఇక విఘ్నేష్‌తో గొడవ పడితే గుడ్‌నైట్ చెప్పేసి పడుకుంటానని పేర్కొంది. తనకు హారర్ చిత్రాలు చేయడం, చూడడం అన్నా ఇష్టమేనని.. కాస్త భయమేసినట్లు ఉన్నా ఎంజాయ్ చేస్తానంది.

  నయన్ మేకింగ్ వీడియో చూశారా

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా అక్టోబరు 5న దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నయనతార నటించింది. ఇందులో సత్య ప్రియా జయదేవ్‌ పాత్రను ఈ బ్యూటీ పోషించింది. అయితే, ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నయన్, చిరు మధ్య సన్నివేశాలున్నాయి. సీఎం కుమార్తెగా, చిరుకి సోదరిగా ఈ సినిమాలో నయన్ వ్యవహరించనుంది.