నూతన సంవత్సరం సందర్భంగా నయనతార, విఘ్నేష్ దంపతులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వీధి వెంబడి నివసించే చిన్నారులకు బహుమతులు పంచిపెట్టి మంచి మనసును చాటుకున్నారు. దీంతో ఈ దంపతులు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్ మీడియాల్లో నెటిజన్లు వీరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గొప్ప పని చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. గతేడాది వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ప్రక్రియ ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవల విడుదలైన నయన్ ‘కనెక్ట్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.