• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tecno Pop 9 5G : బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫొన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే!

    టెక్నో పాప్ 9 5G (Tecno Pop 9 5G) స్మార్ట్‌ఫోన్ ఈ రోజు(సెప్టెంబర్ 24) భారత మార్కెట్‌లో విడుదలైంది. ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్‌కు చెందిన ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందించబడింది. దీనితో పాటు, ఈ డివైస్‌లో NFC సపోర్ట్ కూడా ఉంది. టెక్నో పాప్ 9 5G ఆక్టా-కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది.

    ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది, అలాగే అక్టోబర్ ప్రారంభంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. టెక్నో పాప్ 8 ఫోన్‌కు ఇది అప్‌డేటెడ్ వేరియంట్‌గా లాంచ్ అవుతోంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంగతి తెలిసిందే.

    టెక్నో పాప్ 9 5G ధర

    టెక్నో పాప్ 9 5G ఫోన్ 4GB + 64GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 9,499 గా నిర్ణయించారు. అయితే 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్ కోసం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అక్టోబర్ 7నుంచి ఈ గ్యాడ్జెట్ సేల్స్ ప్రారంభం అవుతాయి. బహుశా దసరా పండగ సందర్భంగా దీని (Tecno Pop 9 5G) సేల్ స్టార్ట్ కావొచ్చు.  వినియోగదారులు రూ. 499 టోకెన్ ధరతో ముందస్తుగా ఈ డివైస్‌ను బుక్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రకారం, ఈ టోకెన్ ఖరీదు కొనుగోలులో భాగంగా అమెజాన్ పే ద్వారా క్రెడిట్ చేయబడుతుంది. టెక్నో పాప్ 9 5G మూడు రంగుల్లో లభిస్తుంది: అరోరా క్లౌడ్, అజూర్ స్కై మరియు మిడ్‌నైట్ షాడో. అదనంగా, రెండు కాంప్లిమెంటరీ ఫోన్ స్కిన్‌లు హ్యాండ్‌సెట్‌తో ఉచితంగా అందించబడతాయి.

    టెక్నో పాప్ 9 5G ఫీచర్లు:

    ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో+నానో) సపోర్ట్‌ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన అన్‌స్పెసిఫైడ్ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. టెక్నో పాప్ 9 5G ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని అందుకుంటుంది, ఇందులో 4GB RAM మరియు 128GB వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.

    ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు  48MP సోనీ IMX582 ప్రధాన కెమెరా సెన్సార్‌తో పాటు LED ఫ్లాష్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 8-మెగాపిక్సెల్‌గా ఉంది. డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఈ ఫోన్‌లో ప్రత్యేకత. 5000mAh సామర్థ్యం గల బ్యాటరీతో పాటు 18W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

    దీనికి అదనంగా, ఈ హ్యాండ్‌సెట్‌లో IP54 రేటింగ్ ఉంది, ఇది దుమ్ము, తేమ నుంచి రక్షణ కల్పిస్తుంది. NFC సపోర్ట్ కలిగిన 5G ఫోన్‌లలో ఈ డివైస్ మొదటిదిగా కంపెనీ ప్రకటించింది. దీని పరిమాణం 165 x 77 x 8mm మరియు బరువు 189g.

    టెక్‌ న్యూస్ కోసం యూసే సైట్‌ను ఫాలో అవ్వండి:

    YouSay తెలుగు వెబ్‌సైట్‌లో గాడ్జెట్‌లతో సహా వివిధ టెక్ న్యూస్ గురించి తాజా వివరాలు అందిస్తారు. అలాగే సోషల్ మీడియా ద్వారా అన్ని తాజా వార్తలను వినియోగదారులకు త్వరగా అందిచడం జరుగుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv