ఇదేం ప్యాంటు.. ఇలా ఉంది..!

[VIDEO:](url)‘ఇదేం ప్యాంటురా బాబూ.. ఇలా కుట్టించింది’ అంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఫ్యాషన్ రంగానికి మకిలి పట్టిందంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మనీష్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకలకు హాజరైన శిల్పా శెట్టి.. వెరైటీ కాస్ట్యూమ్‌తో అలరించింది. ఎప్పుడూ ఫ్యాషన్ డ్రెస్సింగుతో అభిమానాలను పొందే ఈ నటి.. ఈ సారి విఫలమైంది. ‘టూ టోన్‌డ్’ జీన్స్‌ని ధరించడమే ఇందుకు కారణం. అశ్లీలంగా ఉందంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘ఉర్ఫి జావెద్ డిజైన్ చేసినట్టున్నాడు’ అని కామెంట్ చేస్తూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. 50ఏళ్ల వయసుకి చేరువవుతున్న శిల్పా శెట్టి.. నాజూకుగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటుంది.

Exit mobile version