Yatra 2 Movie Review: టీడీపీ టార్గెట్‌గా ‘యాత్ర 2’.. సినిమా ఎలా ఉందంటే? 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Yatra 2 Movie Review: టీడీపీ టార్గెట్‌గా ‘యాత్ర 2’.. సినిమా ఎలా ఉందంటే? 

    Yatra 2 Movie Review: టీడీపీ టార్గెట్‌గా ‘యాత్ర 2’.. సినిమా ఎలా ఉందంటే? 

    February 8, 2024

    నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు 

    రచన, దర్శకత్వం: మహీ వీ రాఘవ 

    సినిమాటోగ్రఫి: మధీ

    మ్యూజిక్: సంతోష్ నారాయణ్ 

    ఎడిటర్: శ్రవణ్

    బ్యానర్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ 

    నిర్మాత: మేక శివ 

    రిలీజ్ డేట్: 08-02-2024

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’ (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ (Yatra 2) వచ్చింది. యాత్ర సినిమా వైఎస్సార్ బయోపిక్‌గా రాగా.. యాత్ర 2 ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి తీశారు. ఈ సీక్వెల్‌ మూవీ ఇవాళ గ్రాండ్‌గా థియేటర్స్ రిలీజయింది. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సినిమాలో జగన్‌కు సంబంధించి ఏం చూపించారు? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథ

    ఈ కథ మనందరికీ తెలిసిందే (Yatra 2 Movie Review). వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా)ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడతాడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతాడు. వైఎస్సార్‌ అకస్మిక మరణంతో జగన్‌ ఓదార్పు యాత్రను చేపడతాడు. అధికార పార్టీ ఆదేశాలను దిక్కరించి ప్రజల్లోకి వెళ్తాడు. యాత్ర చేపట్టిన జగన్‌కు అధికార పార్టీ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఎలాంటి పరిస్థితుల్లో జగన్‌ పార్టీ పెట్టాల్సి వచ్చింది? అరెస్టు తర్వాత జగన్‌ జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదిరించి జగన్ సీఎం అయ్యారు? అన్నది మిగిలిన కథ.

    ఎవరెలా చేశారంటే

    వైఎస్సార్‌గా మమ్ముటి (Mammootty) తొలి 10 నిమిషాలే కనిపించినా తన మార్క్ నటనతో మెప్పించారు. ఇక వైఎస్ జగన్ పాత్రలో నటుడు జీవా (Jeeva) పరకాయ ప్రవేశం చేశారు. జగన్‌ హావభావాలు, రోల్‌కు సంబంధించిన యాటిట్యూడ్‌ను జీవా పక్కాగా దించేశాడనే చెప్పాలి. ఎలాంటి తడబాటు, సందేహాలు లేకుండా జీవా తనకు లభించిన పాత్రలో దూరిపోయాడు. ఇక వైఎస్సార్ భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి అదరగొట్టారు. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్.. మిగిలిన నటీనటులు కూడా ఆకట్టుకున్నారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    ‘యాత్ర’ సినిమాతో అందర్నీ మెప్పించిన దర్శకుడు మహి రాఘవ్.. ‘యాత్ర 2’ లోనూ తన మార్క్‌ చూపించారు. పొలిటికల్ బయోపిక్ అయినా ఎమోషనల్‌గా కథను నడిపి మరోమారు సక్సెస్ అయ్యారు. 2009-2019 మధ్య జరిగిన ముఖ్య రాజకీయ ఘట్టాలను తీసుకొని జగన్‌కు ఎలివేషన్స్ ఇస్తూ కథ నడిపించారు. ఫస్టాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే సెకండాఫ్‌లో రెగ్యులర్ పొలిటికల్ స్టఫ్ ఉండటంతో రొటీన్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్‌ వస్తుంది. వైఎస్సార్‌, జగన్‌కు సంబంధించిన కొన్ని ఒరిజినల్‌ విజువల్స్‌ సినిమాలో వాడటం ప్లస్ అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా మీడియాను, జగన్‌ను ఫాలో అయిన వారికి ఈ సినిమా అంత ఎక్సైటింగ్ అనిపించదు. అలాగే కొన్ని సీన్లు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తాయి.  

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మధీ అందించిన సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్‌లో, జగన్ పాత్రకి ఎలివేషన్స్ సమయంలో సంతోష్ నారాయణ్ ఇచ్చిన BGM హైలెట్‌గా నిలుస్తుంది. శ్రవణ్‌ ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్ పాయింట్స్‌

    • జీవా నటన
    • భావోద్వేగ సన్నివేశాలు
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • సాగదీత సీన్స్‌
    Telugu.yousay.tv Rating : 3/5

    CLICK HERE FOR ENGLISH REVIEW

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version