ప్రముఖ బైక్ తయారీ కంపెనీ KTM సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ‘2024 KTM 790 Adventure’ పేరుతో అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. అతి త్వరలోనే ఈ బైక్ భారత్ సహా మిగిలిన దేశాల్లో అందుబాటులోకి రానుంది. KTM బైక్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్ ఉండటంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ నయా బైక్‌పై పడింది. ఈ బైక్ ఫీచర్లు, ధర వంటి విషయాలను బైక్ ప్రియులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న KTM 790 Adventure బైక్ విశేషాలను YouSay మీ ముందుకు తీసుకువచ్చింది. వాటిపై ఓ లుక్కేయండి.
డిజిటల్ స్క్రీన్
2024 KTM 790 అడ్వెంచర్ బైక్‌కు ఐదు అంగుళాల TFT డిస్‌ప్లేను అమర్చారు. దీనికి మ్యాప్స్, ఇన్‌కమింగ్ కాల్స్, మ్యూజిక్, ఫ్యూయల్ ట్యాంక్ & బైక్ స్పీడ్ సమాచారం వంటి ఫీచర్లను అందించారు.
ఇంజిన్ సామర్థ్యం
ఈ బైక్ 790cc లిక్విడ్ కూల్డ్ ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 87 Nm గరిష్ట టార్క్ వద్ద 70kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక బైక్‌ను 6 speed transmissionతో తీసుకొచ్చారు. 2x రేడియల్ మౌంటెడ్ ఫోర్ పిస్టన్ కాలిపర్‌తో 320mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక 260mm డిస్క్ బ్రేక్‌ను అమర్చారు.
గరిష్ఠ వేగం & మైలేజ్
790cc పవర్‌ఫుల్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ గరిష్టంగా 225 kmph వేగంతో దూసుకెళ్తుందని KTM వర్గాలు తెలిపాయి. అలాగే లీటర్‌కు 22.2 kmpl మైలేజ్ కూడా ఇస్తుందని పేర్కొన్నాయి.
రైడ్ ఎక్స్‌పీరియన్స్
ఈ నయా KTM బైక్ మంచి రైడింగ్ అనుభూతిని పంచుతుందని కంపెనీ చెబుతోంది. దీనికి Pirelli Scorpion STR tyresను అమర్చినట్లు చెప్పింది. వీటి ద్వారా ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ మార్గాల్లో రైడర్లు అలవోకగా ప్రయాణించవచ్చని పేర్కొంది.
ధర ఎంతంటే?
ఈ బైక్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై KTM కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ KTM 790 అడ్వెంచర్ బైక్ 2024 ఏప్రిల్‌లో లాంచ్ అవుతుందని ఆటోమెుబైల్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ధర రూ. 10 – 11 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!