ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్‌పై ఎన్నో వివాదాలు చెలరేగగా వాటిని సరిచేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.
ట్రైలర్ యాంగిల్
ఆదిపురుష్ ట్రైలర్‌ను రామ భక్తుడు అంజనేయుడి యాంగిల్‌లో చూపించారు. “రఘు రాముడు మనషిగా పుట్టిన భగవంతుడు. ఆయన జీవితం ధర్మానికి.. సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుని గాథ. యుగయగాలకు సజీవం.. నా రాఘవుని కథే రామాయణం అంటూ వాయిస్ ఓవర్ ద్వారా సినిమా కథా సారాంశాన్ని చెప్పారు.
ట్రైలర్‌లో ఏముంది?
ట్రైలర్‌లో రావణుడు సీతమ్మతల్లిని అపహహించడానికి వెళ్లడం, జటాయువు రక్షించేందుకు రావడం. వానర సైన్యాన్ని ఏకం చేసి లంకపై యుద్ధం ప్రకటించడం వంటివి చూపారు. లంకపై యుద్ధం ప్రకటించి రావణాసురిడిని వధించి సీతమ్మ తల్లిని కాపాడటం వంటి కీలక ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు.
శ్రీరాముడిగా (ప్రభాస్) సంభాషణలు ఆకట్టుకున్నాయి. లంకలో ఉన్న సీత మాతను తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని చాటింది. ట్రైలర్‌ను చూస్తుంటే ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం మొత్తం కాకుండా సీతాపహరణం వర్గం వరకే పరిమితం చేశారని తెలుస్తోంది.
నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా
ట్రైలర్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ నేటి జనరేషన్‌కు అర్థమయ్యే రీతిలో సరికొత్తగా తెరకెక్కించారు. ఆధుకతలో రామాయణ కథను భాగం చేస్తూ విజువల్స్ గ్రాఫిక్స్‌తో సినిమాను తెరకెక్కించారు.
హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌ను కలబోసి నేటి తరం దృష్టి కోణంలో కథ నడిచినట్లు తెలుస్తోంది.
బలహీనతలు:
ట్రైలర్‌లో వచ్చిన కొన్ని సీన్లు బాహుబలి సినిమాను గుర్తు చేశాయి. వానరసేనకు శ్రీరాముడు(ప్రభాస్) ధైర్యం చెప్పే సీన్ బాహుబలి సీన్‌ను గుర్తు చేస్తుంది.
తెలుగు ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ కొంచెం అర్థం కావు. బహుశా హిందీ మాతృకలో సినిమా తీయడం వల్ల కావచ్చు అనిపిస్తుంది.
డైలాగ్స్ తెలుగు నెటివిటికి తగ్గట్టుగా వస్తే బాగుండేది. సినిమాలో ఆ ప్రయత్నం జరిగి ఉండొచ్చు.
ఫైనల్‌గా
భరత జాతి ఎంతగానో ఆరాధించే రామాయాణం ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరికెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదల కానుంది. మొత్తంగా గతంలో టీజర్ కంటే ట్రైలర్ బాగుంది. మొత్తంగా కొత్త ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు చిత్ర యూనిట్.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!