బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన ఛత్రపతి (హిందీ) సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరూచా హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఇవాళ రిలీజ్ కాగా తన గ్లామర్‌తో నుష్రత్ ఆకట్టుకుంది.
ఛత్రపతి (హిందీ) సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ నుష్రత్ గ్లామర్ ట్రీట్ మాత్రం అదిరిపోయిందని వీక్షకులు చెబుతున్నారు. తన అందచందాలతో అదరగొట్టిందని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
‘కిట్టీ పార్టీ’ (2002) అనే హిందీ సీరియల్లో నుష్రత్ తొలిసారి బాలనటిగా నటించింది. ఆ తర్వాత ‘జై సంతోషి మాత’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
‘ప్యార్ కా పంచనామా’, ‘సోను కె టిటు కి స్వీటీ’ సినిమాలతో నుష్రత్ విజయాలు అందుకుంది.
2019లో ఆయుష్మాన్ ఖురానాతో చేసిన ‘డ్రీమ్ గర్ల్’ సినిమా నుష్రత్కు పెద్ద హిట్ తెచ్చిపెట్టింది.
అక్షయ్ కుమార్ హీరోగా చేసిన రామ్ సేతు, సెల్ఫీ సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది.
కండోమ్ నేపథ్యంలో రూపొందిన ‘జనహిత్ మే జారీ’ సినిమా నుష్రత్ కు పేరుతో పాటు గౌరవం తీసుకొచ్చింది. ఇందులోని నటనకు గాను నుష్రత్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రముఖ సింగర్ హనీ సింగ్‌తో ఈ భామ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. వారిద్దరూ ఓ ఈవెంట్లో చెట్టాపట్టాలేసుకొని కెమెరాలకు చిక్కడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.
అయితే డేటింగ్ రూమర్స్‌ను నుష్రత్ కొట్టిపారేసింది. ‘ అందరిలాగే నా గురించి కూడా ఏదేదో అనుకుంటున్నారు.. అనుకోండి. నేనేం పట్టించుకోను. నాకే సమస్యా లేదు’ అని చెప్పుకొచ్చింది.
నుష్రత్.. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. నుష్రత్ అందాలను చూసిన నెటిజన్లు ఊహల్లో విగరిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ హీరోయిన్లలో నుష్రత్ ఒకరు. ప్రస్తుతం ఆమె ఖాతాను 5.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!