• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Google Pixel 8 Series: కెమెరా ఫీచర్లు లీక్.. ఐఫోన్ పని అయిపోనట్లేనా? 

    గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు త్వరలోనే లాంఛ్ కానున్నాయి. ఈ క్రమంలో పిక్సెల్ 8 మోడళ్ల కెమెరా ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్లు అప్‌గ్రేడెడ్ కెమెరా ఫీచర్లతో రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పిక్సెల్  7 సిరీస్ ఫోన్లతో పోలిస్తే మెరుగైన కెమెరా స్పెషిఫికేషన్స్ ఉండనున్నాయి. అవేంటో పరిశీలిద్దాం. 

    గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ప్రైమరీ కెమెరాలో భారీ మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రెండు మోడళ్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా రానుందట. సామ్‌సంగ్ ఐసోసెల్ జనరేషన్2(ISOCELL GN2) సెన్సార్‌ని ఇది కలిగి ఉంటుంది. పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లలో సామ్‌సంగ్ ఐసోసెల్ జీఎన్1 సెన్సార్ ఉంది. దీంతో పోల్చుకుంటే జీఎన్2లో మరింత క్లారిటీగా ఫొటోలు రానున్నాయి. తక్కువ కాంతిలోనూ 35 శాతం మేర మెరుగ్గా ఫొటోలు తీసే వీలుంది. అడాప్టివ్ టచ్ మెరుగ్గా ఉండనుంది. 

    పిక్సెల్ 8 ప్రోలో భారీ మార్పులు..

    పిక్సెల్ 8 ప్రో మోడల్‌లో అల్ట్రా వైడ్ కెమెరాలోనూ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం పిక్సెల్ 7 ప్రో మోడల్‌లో 12MP Sony IMX386 సెన్సార్ కెమెరా ఉంది. పిక్సెల్ 8 ప్రోలో 64MP Sony IMX 787 సెన్సార్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. అంటే జూమ్ రేషియో 0.55 రెట్ల నుంచి 0.49రెట్లకు పెరగనుంది. దీంతో పాటు 48MP Samsung GM5 టెలిఫొటో కెమెరా ప్రో 8లోనూ కొనసాగనుంది. 8×8 సెన్సార్ టైమ్ ఆఫ్ ఫ్లైట్(time of flight (ToF)) VL53L8 సెన్సార్ అదనంగా రానుంది. ఇది ఆటోఫోకస్ పర్ఫార్మెన్స్‌ని మెరుగ్గా చేయడానికి ఉపయోగపడుతుంది. 

    పిక్సెల్ 8లో యథాతథం..

    పిక్సెల్ 8 మోడల్‌లో కేవలం ప్రైమరీ కెమెరాలోనే మార్పులు జరగనున్నాయి. 50 మెగాపిక్సెల్ ఐసోసెల్ జీఎన్2తో రానుంది. కానీ, అల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా(12MP Sony IMX386) యాథాతథంగా కొనసాగనుంది. అయితే, జూమ్ రేషియోను 0.66 రెట్ల నుంచి 0.55 రెట్లకు పెంచనున్నారు. 

    సెల్ఫీ కెమెరా..

    సెల్ఫీ కెమెరా విషయానికొస్తే.. పెద్దగా మార్పులు లేనట్లు తెలుస్తోంది. రెండింట్లోనూ 11 మెగాపిక్సెల్ సామ్‌సంగ్ 3J1 సెల్ఫీ కెమెరా ఉండనుంది. పిక్సెల్ 8 ప్రో మోడల్‌లో శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్‌ని అమర్చనున్నట్లు తెలుస్తోంది. 

    కెమెరా సాఫ్ట్‌వేర్ ఫీచర్లు..

    తక్కువ వెలుతురులో ఎల్‌ఈడీ ఫ్లాష్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్నిసార్లు ఫొటోలు ఓవర్ ఎక్స్‌పోజ్ అవుతాయి. దీనికి చెక్ పెట్టడానికి పిక్సెల్ 8 సిరీస్‌లలో అడాప్టివ్ టార్చ్ ఫీచర్ రానుంది. అంటే, వెలుతురుని అంచనా వేసి కావాల్సిన మేరకు ఫ్లాష్‌ని విడుదల చేస్తుంది. సీన్ సెగ్మెంటేషన్ అనే మరొక ఫీచర్ కూడా రానుంది. బ్లర్ సెలక్షన్ టూల్ సహాయంతో సినిమాటిక్ మోడ్ వీడియోల విషయంలో లబ్ధి పొందే ఛాన్స్ ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv