ప్రముఖ ట్రెడిషనల్ వాచ్ తయారీ కంపెనీ ఫాజిల్ డీజిల్ గ్రిఫ్డ్ జనరేషన్ 6(Diesel Griffed Gen 6) పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను ఇటీవల విడుదల చేసింది. ఇప్పటికే స్మార్ వాచ్‌ల విపణిలో రాజ్యమేలుతున్న ఆపిల్, సామ్సంగ్ వాచ్లకు ఎలాంటి పోటీ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర, వేరియంట్స్, ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఓసారి సమీక్షిద్దాం.
డిజిల్ గ్రిఫ్ట్ డిజైన్
డిజిల్ గ్రిప్ట్ రౌండ్ స్క్రీన్‌లో లభిస్తోంది. ఆపిల్, సామ్ సంగ్ వాచ్‌లతో పోలిస్తే కాస్త బరువుగా ఉంటుంది. 45mm సైజ్‌లో తయారైంది. వాచ్ అయితే రగ్డ్ లుక్‌లో ప్రీమియంగా కనిపిస్తోంది. వాచ్‌కు ప్రామినెంట్ స్క్రోలింగ్ బటన్ ఉంటుంది. దీనిపై డీజిల్ లోగో షైనీగా ఉంటుంది. స్క్రోలింగ్ బటన్స్‌కు ప్లాస్టిక్ తొడుగులు ఉంటాయి. వాచ్ ఫేస్ మాత్రం చూడగానే ప్రీమియం లుక్‌లో ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
డీజిల్ గ్రిఫ్డ్ నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. స్టేయిన్ లెస్ స్టీల్, మెటల్, బ్రౌన్ లెదర్, నైలాన్ &సిలికాన్ స్ట్రాప్స్ వేరియంట్లలో ఆకట్టుకుంటోంది.
డీజిల్ గ్రిఫ్డ్ స్మార్ట్ వాచ్ మొత్తం డయల్ పరిమాణం 45 మిమీ ఉన్నప్పటికీ, స్క్రీన్ దాదాపు 1.3 అంగుళాల వ్యాసంతో చాలా చిన్నగా ఉంటుంది. వాచ్ స్ట్రాప్స్ గన్మెటల్ వేరియంట్ పట్టీ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. గడియారం అడుగు భాగంలో హృదయ స్పందన రేటు, ఇతర ఫంక్షన్ల కోసం ఆప్టికల్ సెన్సార్లు, మాగ్నెటిక్ ఛార్జర్‌ను లాక్ చేసే సర్కిల్స్ ఉంటాయి.
డీజిల్ గ్రిఫ్డ్ Gen 6 వాటర్ రెసిస్టెన్స్ 3ATM వద్ద రేట్ చేయబడింది. ఇది Qualcomm Snapdragon Wear 4100+ చిప్సెట్తో పనిచేస్తుంది. బ్లూటూత్, Wi-Fi, NFC కనెక్టివిటీ కలిగి ఉంది.
సాఫ్ట్వేర్, ఇంటర్ఫేస్, యాప్స్
డీజిల్ గ్రిప్ట్ జనరేషన్ 6 గూగుల్ వేర్ OS 3 వేర్షన్ సాఫ్ట్‌వేర్‌తో నడుస్తుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌తో పాటు అమెజాన్ అలెక్సా డిజిటల్ అసిస్టెంట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. వాచ్‌ను ఫంక్షనింగ్స్ను ఆపిల్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఆపరేట్ చేయవచ్చు.
‘అలెక్సా’ వాయిస్ అసిస్టెంట్‌తో స్మార్ట్ హోమ్ డివైజ్స్ను కంట్రోల్ చేయవచ్చు. వాతావరణ సమాచారం, టైమర్ సెట్టింగ్, న్యూస్ ఇన్ఫర్మెషన్ చిటికెలో పొందవచ్చు.
అలాగే స్మార్ట్ ఫొన్ల నుంచి వచ్చే వాట్సాప్ సహా ఇతర నోటిఫికేషన్లను వాచ్‌లో చూడవచ్చు రిప్లే ఇవ్వవచ్చు. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇన్‌బిల్ట్ 14 వాచ్ ఫేసెస్ ఈ స్మార్ట్ వాచ్‌కు మంచి లుక్‌ను ఇస్తాయి. అదనంగా కావాల్సిన వాచ్ ఫేసెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
డీజిల్ గ్రిప్డ్లో గూగుల్ ప్లే స్టోర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. వాచ్‌లో మరో ప్రత్యేకత జీపీఎస్ కనెక్టివిటీని కలిగి ఉండటం. గూగుల్ మ్యాప్స్ ఉండటం వల్ల ట్రావెలింగ్ సమయంలో ఈజీగా నావిగేషన్ చేసుకోవచ్చు.
హెల్త్‌కు సంబంధించి అన్ని యాప్స్… స్టెప్స్ కౌంట్, స్లీప్ రేట్, హృదయ స్పందన రేటు, కార్డియో గ్రామ్, SPO2 వంటి ముఖ్యమైన ట్రాకర్లను వాచ్ కలిగి ఉంది.
అయితే ఇదే ధరలో లభిస్తున్న సామ్సంగ్ వాచ్ 5(SAMSUNG WATCH 5)తో పోల్చినప్పుడు ఈ యాప్స్ కచ్చితత్వం కాస్త తగ్గిందని చెప్పవచ్చు.
బ్యాటరీ లైఫ్ & పర్ఫామెన్స్
వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 24 గంటలు లైఫ్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. మ్యాగ్నటిక్ ఛార్జర్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే రెగ్యులర్ కాల్స్, వాచ్ ఫెసెస్ విరివిగా మార్చడం, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫంక్షన్స్ యూజ్ చేస్తే 12-13 గంటల వరకు మాత్రమే బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
ధర
డీజిల్ Griffed Gen 6 Wear ధర రూ. 25,995గా నిర్ణయించారు. ప్రస్తుతం అమెజాన్‌లో సేల్కు వచ్చింది.
ఫైనల్‌గా.
GOOD
- వాచ్ లుక్ పరంగా చాలా బాగుంది
- గూగుల్ OS 3 బాగా పనిచేస్తుంది, మంచి వాచ్ ఫేస్‌లు
- డీసెంట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్
- కాల్స్ కనెక్టివిటీ, ఆన్సరింగ్ కాల్స్ బాగుంది
BAD
- వాచ్ చాలా బరువుగా, బల్కీగా ఉండటం
- ఫిట్నెస్ ట్రాకింగ్ అక్యూరెట్గా లేకపోవడం
- బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉండటం
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!