రిలయన్స్ జియో తన సరికొత్త బడ్జెట్ లాప్‌టాప్‌ను జులై 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ‘జియోబుక్’ లాప్‌టాప్‌ను ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే లాప్‌టాప్‌కు ‘యువర్ అల్టిమేట్ లెర్నింగ్ పార్టనర్’ అనే ట్యాగ్‌లైన్‌ని ఇచ్చింది. రిలయన్స్ కంపెనీ జియోబుక్‌ను 2022 అక్టోబర్‌లోనే మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు అదే ల్యాప్‌టాప్ అప్డేటెడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి వస్తోంది.
స్టైలిష్ లుక్ అదుర్స్
ఈ జియోబుక్‌కు సంబంధించిన టీజర్ అమెజాన్‌లో విడుదలైంది. ఇందులో జియోబుక్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి కొంత సమాచారం ఇచ్చారు. ఈ జియో లాప్ టాప్ చాలా సన్నగా, తక్కువ బరువుతో ఉంటుంది. ఇది కేవలం 990 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందని కంపెనీ స్పష్టం చేస్తోంది. అలాగే ఒకసారి దీని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా పనిచేసుకోవచ్చని చెబుతోంది.
ఎంటర్‌టైన్మెంట్‌కు అడ్డా
వాస్తవానికి జియోబుక్ అప్‌డేట్ వర్షన్ పాత లాప్‌టాప్ మాదిరి డిజైన్‌నే కలిగి ఉంది. కానీ, ఈసారి మరింత కాంపాక్ట్‌గా, సైలిష్ బ్లూ కలర్‌తో దీనిని తీసుకొస్తున్నారు. ఈ జియోబుక్ అన్ని వయస్సుల వారికి అనుగుణంగా ఉంటుందని, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్టివిటీ, గేమింగ్‌లకు సపోర్ట్ చేస్తుందని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ల్యాప్‌ట్యాప్‌లోని మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు.. జులై 31న లాంఛ్ చేసినప్పుడే మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే గతంలో వచ్చిన జియోబుక్‌కు ఇది అప్‌డేట్ వెర్షన్ కావడంతో చిన్న చిన్న మార్పులు మినహా దాదాపుగా అప్పటి ఫీచర్లనే ఇది కలిగి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత వర్షన్ లాప్‌టాప్ ఎలాంటి ఫీచర్లను కలిగి ఉందో ఇప్పుడు చూద్దాం.
జియోబుక్ డిస్‌ప్లే
2022 అక్టోబర్‌లో రిలీజ్ అయిన జియోబుక్‌లో 11.6 అంగుళాల డిస్‌ప్లే, బ్రాడ్ బెజిల్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, దానికి అనుసంధానంగా అడ్రినో 610జీపీయూ పొందుపరిచారు.
స్టోరేజీ సామర్థ్యం
జియోబుక్ లాప్‌టాప్ 2GB RAM + 32GB eMMC స్టోరేజ్కలిగి ఉంది. అలాగే ఇందులోని స్టోరేజ్‌ను 128జీబీ వరకు పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఈ జియో ల్యాప్‌టాప్ Jio OSతో రన్ అవుతుంది. ఇందులో అనుమతించిన థర్డ్ పార్టీ యాప్‌లను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
కెమెరా & బ్యాటరీ
జియోబుక్ లాప్‌టాప్ ద్వారా వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఇందుకు వీలుగా 2 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లో 5000mAh బ్యాటరీని పొందుపరిచారు. ఒకసారి ఛార్జ్ చేస్తే కనీసం 8 గంటల వరకు నిర్విరామంగా పనిచేసుకోవచ్చు. అయితే అప్‌డేట్ వర్షన్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో బ్యాటరీ కేపాసిటీ మెరుగు పడనుంది.
జియో సిమ్
జియోబుక్‌లో 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, HDMI మినీ, వై-ఫై, ఇంకా అనేక ఫీచర్లు ఉన్నాయి. వాస్తవానికి ఈ ల్యాప్‌టాప్‌లో జియోసిమ్ కార్డు ఉంటుంది. దీని ద్వారా 4G LTE కనెక్టివిటీని పొందొచ్చు.
ధర ఎంతంటే?
గతేడాది జియోబుక్ లాప్‌టాప్‌ను లాంఛ్ చేసినప్పుడు దాని ధరను రూ.20,000 రేంజ్లో రిలయన్స్ ఉంచింది. తాజా అప్‌డేట్ వర్షన్ కూడా అటు ఇటుగా ఇదే ధర ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు ధర తెలియాలంటే జులై 31 వరకూ ఆగాల్సిందే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!